పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అంటుంది. 35,6. కాని నరుని పాపం భగవంతునికి కీడు చేయలేక పోయినా, నరునికి కీడుచేసి తీరుతుంది. ఇక యీ నరుణ్ణీ భగవంతుడు ప్రేమిస్తుంటాడు గనుక నరుణ్ణి బాధించడం ద్వారా పరోక్షంగా భగవంతుణ్ణీగూడ బాధిస్తుంది. దావీదు రాజు ఊరియాను చంపి అతని భార్యయైన బత్షెబాను తన భార్యను చేసుకున్నాడు. ఈ ఊరియా యిస్రాయేలీయుడు కూడా కాదు, అన్యజాతివాడు. ఐనా ఊరియా వథవల్ల దావీదు యావేను తృణీకరించాడనీ, ఆయన యెదుట చెడ్డపని చేసాడనీ చెప్పబడింది - సమూ 12,9. ఇదేవిధంగా మన పాపాలుకూడ ప్రత్యక్షంగా మనలనూ పరోక్షంగా దేవుళ్లీ బాధిస్తాయి. మరికొన్ని తావుల్లో బైబులు నరులపాపం భగవంతునికి కోపం రప్పిస్తుందని చెప్తుంది. యిస్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి కోపానికి పరికొల్పవద్దంటాడు యెషయా-1,4

16. జీవజలాల ఊటనైన నన్ను వదలివేసారు - యిర్మీ2, 13.

పాపంద్వారా నరుడు భగవంతుడిచ్చే జీవాన్ని నిరాకరిస్తాడు. నరులపాపం దేవునకూ తమకూ మధ్య ఓ అగాధపు గుంటను కలిగిస్తుంది అన్నాడు ప్రవక్త యెషయా - 59,2. అనగా పాపంద్వారా దేవునికీ నరునికీ మధ్యగల సంబంధం తెగిపోతుందని భావం. “నా జనం జీవజలాల ఊటనైన నన్ను విడచి, బ్రద్దలె నీళ్ళ నిలువని తొట్లను తొలిపించుకున్నారు" అంటాడు ప్రవక్త యిర్మియా - 2,13. జీవజలాలను అనుగ్రహించేవాడు ప్రభువు. మన పాపంద్వారా ఈ జీవజలాన్ని నిరాకరిస్తాయి. దానికి మారుగా సృష్టివస్తువులనే జలాన్ని సంపాదించి బ్రద్ధలైపోయిన తొట్టిలో యిముడ్చుకోవాలని చూస్తాం. కాని మన ప్రయత్నం నెగ్గదు. ఇక్కడ భగవంతుడిచ్చే జీవజలాన్ని నిరాకరించడమనగా అతని అనుగ్రహాన్ని కాలదన్నడమని భావం. ఈలా పాపంద్వారా నరుడు భగవంతుడు ప్రేమతో ప్రసాదించే జీవాన్ని నిరాకరిస్తుంటాడు.

17. వాళ్లు మూర్ఖచిత్తులూ, విశ్వాసంలేని ప్రజలు - ద్వితీ 32,20.

సీనాయి పర్వతంవద్ద మోషేద్వారా యావే ప్రభువు యిస్రాయేలు ప్రజతో ఒడంబడిక చేసికున్నాడు. దాని ద్వారా ఆ ప్రజలు అతన్ని మాత్రమే ఆరాధించాలి. అతడు వారిని తన ప్రజగా చేసికోవాలి. వారికి పాలస్తీనా దేశాన్ని ఈయాలి, కాని ఈ యొడంబడిక ముగిసీముగియకముందే యిప్రాయేలు ప్రజలు దాన్ని మీరడం మొదలెట్టారు. ప్రవక్తలు నరుల పాపాలు సీనాయి ఒడంబడికను భగ్నంచేస్తాయి అని బోధించారు. పూర్వవేదం ప్రకారం పాపంలోని ప్రధానాంశం, ఈలా వొడంబడికనూ, వొడంబడిక చేసికున్నదేవుణ్ణి ధిక్కరించడమే.

18. నిన్ను సృజించిన యావే నీ భర్త - యెష54,5

.

యిప్రాయేలు ప్రజలు ఒడంబడికను మీరారనడానికి పూర్వవేదం తల్లి, తండ్రి, వరుడు అనే ఉపమానాలను వాడింది. ఒడంబడిక ద్వారా యావే ఆ ప్రజకు తండ్రి