పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నేడు మనం మన పొలాన్ని మన సొంతభూమిగా భావిస్తాం. కాని పూర్వం యిస్రాయేలీయులకు ఈ భావం వుండేది గాదు. యూదులనుభవించే వాగ్రత్త భూమి, అనగా కనాను మండలం, వాళ్ళది కాదు. ప్రభువుది. అతడు ఆ భూమిని యూదులకు గుత్తకిచ్చాడు. వాళ్లు పరదేసుల్లాగ దాన్ని అనుభవించాలి — లేవీ 25,23-24. కనుక ఎవ్వరూ వాగ్గత్త భూమిని శాశ్వతంగా అమ్మలేరు. శాశ్వతంగా కొనుక్కోలేరు కూడ, అది ప్రభువుది. యూదులు దానికి ధర్మకర్తలు మాత్రమే. ఇంకా ప్రభువు ఈ నేలను పండ్రెండు గోత్రాల వాళ్ళకు పంచియిచ్చాడు. కనుక వాళ్ళందరూ ఓ సమాజంగా జీవిస్తూ ఆ భూమిని సమంగా పంచుకొని అనుభవించాలి. ఎవరైనా అత్యాశతో గట్టురాళ్ళను తొలగించి తన పొరుగువాడి పొలాన్ని ఆక్రమించుకొంటే ప్రభువు వాడ్డి శపిస్తాడు. ఈలాంటి పాపులనుద్దేశించి హోషేయా ప్రవక్త"యూదానాయకులు గట్టరాళ్లు తొలగిస్తున్నారు. నా కోపం వాళ్ళమీదికి ఓ ప్రవాహంలాగ దిగివస్తుంది అన్నాడు - 6,10. ఇంకా సామెతల గ్రంథం "మీ పూర్వులు పాతిన గట్టురాళ్ళను తొలగించవద్దు" అంటుంది - 23, 29. కనుక పూర్వవేదప్రజలకు మనకులాగ సొంతభూమి అనే భావంలేదు. వాళ్ళకు యావే భూమిని మేము అనుభవిస్తున్నాం అనే భావం వుండేది. మాతోపాటు తోడి జనం గూడ ఆ భూమిని అనుభవించాలి, ప్రభువు పండ్రెండు గోత్రాలవాళ్ళకీ వాగ్రత్త భూమిని ఇచ్చాడు అనే భావంకూడ వుండేడిది. ఈ యూదుల భావంనుండి నేడు మనంకూడ ఓ నీతిని నేర్చుకోవాలి. భగవంతుడు భూమిని అందరు నరులకోసమూ సృజించాడు. కాని మనదేశంలో కొద్దిమంది తెలివైనవాళూ ధనవంతులూ ప్రోగై మొత్తం నేలలో 60 శాతం ఆక్రమించుకొన్నారు. మిగతా దేశానికంతటికీ నలభైశాతం నేలను మాత్రమే వదలివేసారు. ఇది పెద్ద సాంఘిక అన్యాయం. ఇటీవలి భూసంస్కరణలు కూడ ఈ యన్యాయాన్ని పెద్దగా చక్కదిద్దలేక పోయాయి. ఇక ధర్మశాస్త్రానికి వద్దాం. మోషేధర్మశాస్త్రం దయకూ కారుణ్యానికి పెట్టింది పేరు. న్యాయస్థానంలో దోషిని కొరడా దెబ్బలతో శిక్షించేపుడు నలభై దెబ్బలతో ఆగాలి. అంతకన్నా ఎక్కువగా కొడితే అతన్ని బహిరంగంగా అవమానించినట్లవుతుంది - ద్వితీ 25,3. ఒక్క నరులమీదనేగాదు, పక్షులమీద వృక్షాలమీదగూడ కనికరం జూపాలి అంటుంది ధర్మశాస్త్రం. "మీరు అటూయిటూ వెళ్ళేప్పడు చెట్టుమీదనో నేలమీదనో ఓ పక్షిగూడు కన్పించిందనుకోండి. ఆ గూటిలో తల్లిపక్షి గ్రుడ్లమీదనో పిల్లలమీదనో కూర్చుండి