పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ యంశాలన్నీ ద్వితీయోపదేశకాండంలో వర్ణింపబడ్డాయి. "ప్రతి యేడవయేటి చివర మీకు బాకీపడినవాళ్ళ అప్పలను రదు చేయాలి. ప్రతి ఋణదాత తోడి యిస్రాయేలీయుల కిచ్చిన బాకీలను వదలుకోవాలి. ప్రభువే బాకీలు రద్దయినవని ప్రకటిస్తున్నాడు గనుక మీరు వాటిని వసూలుచేయడం తగదు. మీరు విజాతీయులనుండి బాకీలు రాబట్టుకోవచ్చుగాని స్వజాతీయుల నుండిమాత్రం రాబట్టుకోగూడదు. ఈలా చేస్తే ప్రభువు మీకిచ్చే గడ్డమీద మీకు దీవెన లభిస్తుంది. మీరు ప్రభువు ఆజ్ఞను పాటిస్తే ఇక మీలో పేదలంటూ వుండరు. ప్రభువు తాను మాట ఇచ్చినట్లే మిమ్మ దీవిస్తాడు. ఫలితంగా మీరు చాలా జాతులకు అప్పలిస్తారుగాని ఏజాతినుండిగూడ అప్ప తీసికోరు. మీరు చాల జాతులమీద అధికారం చెలాయిస్తారుగాని ఏజాతిగూడ మీమీద పెత్తనం చేయలేదు. దేవుడు మీకిచ్చిన ఈ గడ్డమీద ఏపట్టణంలోనైనాసరే పేద యిస్రాయేలీయులడు ఎవడైనా వుంటే స్వార్థబుద్ధితో అతనికి సాయం చేయడం మానకండి.ఉదారబుద్దితో అతనికి వలసినంత సాయం చేయండి. అప్పలు రద్దయ్యే విశ్రాంతి వత్సరం దగ్గరికొస్తుందిగదా అన్న నీచభావంతో అక్కరలోవున్నవారికి సాయం చేయడం మానకండి మీరు ఆలాచేస్తే అతడు ప్రభువైన నాకు మొరపెట్టుకొంటాడు. అప్పడు నేను మిమ్మ అపరాధులనుగా గణిస్తాను. కనుక మీరు ఉదారబుద్ధితో తోడివారికి సాయం చేయండి. అప్పడు ప్రభువు మీరు చేసే పనులన్నీ దీవిస్తాడు” - 15:1-10.

పై వాక్యాల భావం ఇది. యిస్రాయేలీయుల తోడి యూదులపట్ల సాంఘిక న్యాయాన్ని పాటించాలి. అక్కరలోవున్నపేదవాళ్ళను ఆదుకోవాలి. ఏడవయేడు అప్పలు రద్దవుతాయన్న భావంతో పేదవాళ్ళకు సహాయం నిరాకరించగూడదు. వాళ్ళకు సాయం చేయకపోతే పాపం తగుల్లుంది. సహాయం చేసినవాళ్ళని దేవుడు దీవిస్తాడు. ఇక పై విశ్రాంతి వత్సరంలాంటిదే విడుదల సంవత్సరం కూడ. ఇది ప్రతి యేబదియవయేట వచ్చేది. బాకీలవలన భూములు పోగొట్టుకొన్న పేదవాళ్లు ఈ యేబదియవయేట మళ్ళా తమ భూములను తాము పొందవచ్చు అనగా ధనవంతులు పేదవాళ్ళ భూములను శాశ్వతంగా ఆక్రమించుకోవడానికి వీల్లేదు. ఏబదియవయేట ఎవరి పొలాలను వాళ్ళకు వదలివేయాలి — లేవీ 25,8-13. ఈలా విశ్రాంతి వత్సరమూ, విడుదలయేడూ పేదలకు మేలు చేసాయి.

ఇక్కడే భూమినిగూర్చిన యిస్రాయేలీయుల భావం కూడ అర్థంజేసికోవాలి. ఐగుప్నలో నేల అంతా ఫరో రాజుకు గాని దేవాలయాలకు గాని చెందివుండేది. మెసపొటామియాలో నేల రాజులకూ దేవాలయాలకే గాక కుటుంబాలకూ వ్యక్తులకూ గూడ చెందివుండేది. ఇక, యిప్రాయేలీయులకు నేలను గూర్చి ఓ ప్రత్యేకభావం వుండేది.