పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వచ్చినవాళ్ళే. కనుక నేను మీకు ఈ యాజ్ఞనిచ్చాను" - 24: 19–22. మోషే ధర్మశాస్తానికి సమకాలికాలైన ఐగుప్తు, మెసపొటామియా, హమ్మరబి ధర్మచట్టాలు చాలా వున్నాయి. కాని వాటిల్లో వేటిలోకూడ పేదలకోసమని ఇంత దయతో చేసిన శాసనం మరొకటి కన్పించదు.

ఇట్లంటే ధనవంతులు అనుభవింపగా మిగిలినది పేదల మొగాన వేసేవాళ్ళనికాదు. ప్రతి మూడవయేటి చివరన పండిన పంటలో పదియవవంతు సేకరించి నగరంలో నిల్వజేయాలి. ఈ పంట అనాథులు వితంతువులు పరదేసులు మొదలైన పేదలకోసం - 14:28-29. యూదులు తమతో వసించే పరదేసులను గూడ సజాతీయులను లాగే అంగీకరించి ప్రేమించాలి — లేవీ 19:34. ఈలా ప్రేమింపబడే హక్కు వాళ్ళకుంది.

ప్రభువుకి దీనజనులంటే అపారమైన దయ. కనుక పరదేసులు అనాథులు వితంతువులు మొదలైన బక్కవాళ్లహక్కులకు భంగం కలిగించేవాళ్ళను అతడు శపిస్తాడు - ద్వితీ 27:19.

నరులు ఎల్లపుడూ స్వార్థపరులే, యూదులు మాత్రం పేదసాదలను ఆదరంతో చూస్తారా? కనుక ప్రవక్తలు ఈ యంశాన్ని మాటిమాటికి హెచ్చరించేవాళ్లు, యిర్మీయా రాజకుటుంబాన్ని ఉద్దేశించి "పరదేసులను అనాథులను వితంతువులను దోపిడి చేయవద్దు" అన్నాడు - 22:3, యెషయా అనాథులనూ వితంతువులనూ ఆదుకోవాలి అని బోధించాడు - 1:17. కీర్తనకారుడు "ప్రభువే పరదేసులను పరామర్శిస్తాడు. వితంతువులనూ అనాథులనూ సంరక్షిస్తాడు" అన్నాడు - 146:9. ఇంకా, ప్రభువు అనాథులకూ వితంతువులకూ న్యాయం జరిగిస్తాడు. పరదేసులను ఆదరించి వారికి అన్నపానీయాలు అందిస్తాడు - ద్వితీ 10:18. కాని ప్రభువు ఈ పరదేసులనూ అనాథులనూ వితంతువులనూ ఇంతగా పట్టించుకోవడం దేనికి? పరదేసులు వాళ్ల దేశాన్నీ వాళ్ళ జాతిజనులనూ విడిచిపెట్టివచ్చి యిస్రాయేలును ఆశ్రయించినవాళ్లు, అనాథులకు తల్లిదండ్రులు లేరు. వితంతువులకు భర్తృసంరక్షణం లేదు. అందుచేత దయామయుడైన ప్రభువు ధర్మశాస్త్రం ద్వారా ఈ మూడు వర్గాలవాళ్ళకు భద్రత కల్పించాడు. కనుక ఈ మూడు వర్గాలనూ ఆదరించడం యిప్రాయేలు ప్రజలకు తప్పనిసరి అయింది. ఇక, యూదులు ఈ దీనజనులను ఎందుకు పరామర్శించాలి అంటే, వాళూ ఓమారు ఐగుప్తలో దీనజనులుగా వుంటే ప్రభువు వాళ్ళను ఆదుకొన్నాడు. "మీరు ఐగుపులో బానిసలుగా వ్రుగ్గుతూంటే మీ ప్రభువు మిమ్మచటినుండి విడిపించుకొని వచ్చాడు" - 24:18. ఈ విముక్తికి జ్ఞాపకార్థంగా యూదులు ఇప్పుడు