పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. సాంఘిక న్యాయమూ, ధర్మశాస్త్రమూ

ప్రభువు మోషే ద్వారా ధర్మశాస్తాన్ని ప్రసాదించాడు. దాన్ని అనుసరిస్తేనేగాని యిస్రాయేలీయులు యావేకు ప్రియపడరు. ఇక, ధర్మశాస్త్రం సాంఘిక న్యాయాన్ని పాటించమని ఉదోషిస్తుంది. ఆ కాలంలో మెసపొటామియా, ఐగుప్త, బాబలోనియా ప్రజలకుగూడ ధర్మశాస్తా లుండేవి. కాని వాటన్నిటికంటె అధికంగా మోషే ధర్మశాస్త్రం సాంఘిక న్యాయాన్నిపాటించమనీ పేదసాదల యెడల దయాదాక్షిణ్యాలతో ప్రవర్తించమనీ నొక్కిచెప్పంది. ఆమోసు, యిర్మీయా, యెషయా, మొదలైన మహా ప్రవక్తలంతా ధర్మశాస్త్రం ఆదేశించే సాంఘిక న్యాయాన్ని నిక్కచ్చిగా పాటించాలని మాటిమాటికి హెచ్చరించారు. ఇక్కడ ధర్మశాస్త్రం నుండి సాంఘిక న్యాయానికి సంబంధించిన అంశాలను నాల్డింటిని పరిశీలించిచూద్దాం.

1. పరదేసులు, విధవలు, అనాథులు

మోషే ధర్మశాస్త్రం పరదేసులను వితంతువులను అనాథబాలలను కరుణతో ఆదరించాలని చెప్తుంది. "మీరు పరదేసులను పీడించుకూడదు, బాధించకూడదు. ఒకప్పడు మీరుగూడ ఐగుప్మలో పరదేసులుగా వుండలేదా? మీరు విధవలనుగాని, అనాథులనుగాని, బాధించగూడదు. బాధిస్తే వాళ్లు నాకు మొరపెట్టుకొంటారు. నేను వాళ్ళ మొరవింటాను. నా కోపాగ్ని మీమీద రగుల్కొంటుంది. మిమ్మ నా కత్తికి బలి చేస్తాను. మీ భార్యలు వితంతువు లౌతారు. మీ బిడ్డలు అనాథులౌతారు" - నిర 22, 21-24. కనుక యిస్రాయేలీయలు పై మూడు వర్గాల వాళ్లపట్ల కరుణతో మెలగాలి. ఇంకా ధర్మశాస్త్రం "మీరు పరదేసులకు అనాథులకు అన్యాయం చేయకూడదు. వితంతువు కట్టుబట్టలను తాకట్టుగా తీసికోరాదు." అంటుంది - ద్వితీ 24, 17. හි"එරඑ* సేద్యం జేసే రైతులు పై మూడు వర్గాలవాళ్ళనీ ఆదుకోవాలి. "మీరు పొలంలో పంటకోసేపుడు ఏదైనా వో కట్టను మరచిపోతే మళ్ళా దానికోసం వెళ్ళవద్దు. పరదేసులు అనాథులు వితంతువుల కొరకు దానిని వదలివేయండి. అప్పడు ప్రభువు మీరు చేసే పనులన్నిటినీ దీవిస్తాడు. ఆలాగే మీరు ఓమారు ఓలివపండ్లు కోసుకొన్నంక మళ్ళా రెండవమారు ఆ చెట్లవద్దకు వెళ్లవద్దు. ఆ మిగిలిన పండ్లను పరదేసులు అనాథులు వితంతువులకొరకు వదలివేయండి. ఓమారు ద్రాక్షపండ్ల కోసికొన్నంక మళ్లారెండవమారు S చెట్లవద్దకు వెళ్ళవదు. ఆ మిగిలిన పండ్లను పరదేసులు అనాథులు వితంతువులకొరకు వదలివేయండి. మీ మట్టకు మీరుగూడ ఓ మారు ఐగుప్తలో బానిసలుగా వుండి