పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యిస్రాయేలీయుల మొరను నేను చెవులార విన్నాను. మీ శత్రువులను నిశితంగా శిక్షించి మిమ్మ దాస్యం నుండి విడిపిస్తాను. మిమ్ము నా ప్రజగా స్వీకరిస్తాను. నేను మీకు దేవుణ్ణాతాను. అబ్రాహాము ఈసాకు యాకోబులకు ఇస్తానన్న దేశానికి మిమ్ము తోడ్కొని పోతాను. ఆ గడ్డను మీకు సొంతం చేస్తాను. నేనే ప్రభువుని" - 6,2-8.

పై వాక్యాల భావం యిది. యావే యిప్రాయేలీయులకు తన్ను ప్రభువునిగా తెలియజేసికొన్నాడు. యిస్రాయేలీయులు సాంఘిక అన్యాయానికి లొంగి ప్రుగ్గిపోతూ వున్న తరుణంలో యావే ఈలా తెలియజేసికొన్నాడు. ఆ ప్రజలంటే అతనికి ఎక్కడ లేని జాలి. పైగా యావే ఒడంబడికల దేవుడు. అతడు వాళ్ళను తన ప్రజగాను, వాళ్లు అతన్ని తమ దేవుణ్ణిగాను స్వీకరించారు. ప్రభువు పితరులకు వాగ్గానం చేసిన కనాను దేశాన్ని వాళ్ళకు వారసభూమిగా ఇస్తాడు. యావే ప్రభువని యిప్రాయేలీయులకు అంతకు ముందు తెలియదు. ఇప్పడు ఫరో దాస్యవిముక్తి ద్వారా తెలియవచ్చింది. యావే ఏకైక ప్రభువు. అతన్నిమించిన వాడు లేడు. ఫరోగాని అతడు కొలిచే దేవతలుగాని యూవేను ఎదిరించలేరు.

ఐగుప్త దాస్య విముక్తిద్వారా యిప్రాయేలీయులు యావేను ఏకైక ప్రభువుగా గుర్తించారు అన్నాం. కనుకనే మోషే "మా దేవుడైన యావేకు ఎవరూ సాటిరారు" అంటాడు - 8,10. యావేకూడ" ఈ సర్వప్రపంచంలో నావంటివాడు ఇంకొకడు లేడు" అంటాడు - 9,14. ఈ భూమండలానికంతటికీ అధిపతి ప్రభువే - 9,29. కనుకనే అతడు కానాను మండలాన్ని యిప్రాయేలీయులకు వారసభూమిగా ఈయగలిగాడు. ఆలాంటి ప్రభువుని యిప్రాయేలీయులు ఆరాధించాలి. అతన్ని తప్పితే మరొకర్ని కొలవగూడదు.

ఇక, ఒడంబడిక ద్వారా యిప్రాయేలీయులు ప్రభువు సొంత ప్రజలయ్యారు. వాళ్లు అతన్ని కొలిచే ప్రజలు, అతనిలాగే పవిత్రులైన ప్రజలు - 19,5-6. ఆ కాలంలో యిస్రాయేలీయుల ఇరుగుపొరుగు జాతులు ఎవరికివాళ్లు ఓ సమాజంగా జీవించేవాళ్లు. ఒక్కసమాజంలోని వాళ్ళంతా పరస్పరం ఇచ్చిపుచ్చుకొంటూ అన్నదమ్ముల్లాగ ఐక్యభావంతో మనేవాళ్లు. యావే యిస్రాయేలీయులను కానాను మండలంలో స్థిరపడేలా చేసి వాళ్ళను ఓ సమాజంగా ఏర్పరచాడు. ఆ ప్రభువుని ఆరాధిస్తూ అతని పేరుమీదిగా వాళ్ళంతా పరస్పర ప్రేమతో సోదరుల్లాగ జీవించాలని కోరాడు.

ఈ రీతిగా ఐగుప్త నిర్గమనం యావే ఏకైక ప్రభువనీ, అతన్ని కొలిచేయిస్రాయేలు "ప్రజలంతా తోబుట్టవుల్లాగ కూడిమాడి జీవించేవాళ్ళనీ విశదపరచింది.