పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెళ్ళనిమ్మని నీతో చెప్పాను. కాని అతడు వెళ్ళడానికి నీవంగీకరించలేదు. కనుక నేను నీకు మొట్టమొదట పట్టిన కుమారుణ్ణె హతమారుస్తాను" అన్నాడు. 4,22-23. తాను చెప్పినట్లే ప్రభువు ఐగుస్తీయుల తొలిచూలు పిల్లలందరిని చంపాడు. రామ్సెసు మొదటి కొడుకు, ఆ దేశంలోని ప్రథమ కుమారులు, పసులు తొలిచూలు దూడలు – అందరూ చచ్చారు. ఇది పదియవ అరిష్టం.

దానితో ఫరోకు గుండె చెదరింది. అతడు మోషేను చూచి "నేను మీ దేవుడైన యావేకూ మీకూ ద్రోహం చేసాను. ఈ సారికి నా పాపాలను క్షమించండి" అన్నాడు - 10, 16-17 యిప్రాయేలీయులను మందలు తోలుకొని తమ దేశం విడిచివెళ్ళమని కోరాడు. ఆలా వెళూ తన్నుకూడదీవించి పొమ్మని ప్రాధేయపడ్డాడు - 12, 32. ఇకనేం, యిస్రాయేలీయులు ఐగుప్రీయులను దోచుకొని అక్కడినుండి వెళ్లిపోయారు.

ఈలా ప్రభువు మోషే నాయకత్వాన యిస్రాయేలీయులను ఐగుపునుండి తోడ్కొనివచ్చాడు. కాని ఇక్కడ ప్రభువు ఈ ప్రజల జీవితంలో జోక్యం కలిగించుకొంది దేనికి? వాళ్ళకు జరిగే సాంఘిక అన్యాయాన్ని ప్రభువు భరించలేకపోయాడు. ఆ యన్యాయాన్ని చక్కదిద్దడానికి పూనుకొన్నాడు. పది యరిష్ణాలతో ప్రజాపీడకుడైన ఫరోను అణగదొక్కాడు. కనుక ప్రభువయిస్రాయేలీయుల జీవితంలో జోక్యం కలిగించుకొనడానికి కారణం సాంఘిక అన్యాయమే. వాళ్ళ రక్షణ చరిత్రలో అదే మొదటి మెట్టు. యిస్రాయేలీయుల రక్షణం ప్రప్రథమంగా ఆధ్యాత్మికమైంది కాదు, ఐహికమైంది.

2. యావే ఏకైక ప్రభువు, ప్రజలంతా సోదరులు

సాంఘిక న్యాయాన్ని చక్కదిద్దడంకోసం ప్రభువు యిప్రాయేలీయుల చరిత్రలో జోక్యం జేసికొన్నాడు అని చెప్పాం. కాని యావే కేవలం సాంఘిక అన్యాయాన్ని చక్కదిద్దేవాడు మాత్రమేనా లేక ఇంకేమైనా ఆశయాలు కలవాడు కూడానా? అతడు ప్రజలకు తాను ఏకైక ప్రభువునని తెలియజేసాడు. తన్ను కొలిచేవాళ్ళంతా సోదరుల్లాగా కలసిమెలసి ఒక్క సమాజంగా జీవించాలని కోరాడు. ఈ రెండు ఆశయాల కోసంగూడ అతడు యిస్రాయేలీయులను ఐగుప్ననుండి తరలించుకొని వచ్చాడు. ఈ రెండంశాలను పరిశీలిద్దాం.

యావే ఈలా అన్నాడు. "నేను ప్రభువుని, సర్వశక్తి మంతుణ్ణేయిన దేవుణ్ణిగా నేను పూర్వమే అబ్రాహాము ఈసాకు యాకోబులకు ప్రత్యక్షమయ్యాను. కాని యావే అనే పేరుతో మాత్రం వారికి నన్నెరుకపరచుకోలేదు. ఐగుప్తియులు బానిసలుగా చేసిన