పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేయించి ఆ భవనాలను కట్టించడం మొదలెట్టాడు - 1, 11. ఆ ప్రజలు అతనికి బానిసలైపోయారు. ఆ భవనాలకు అంతులేదు. యూదుల అగచాట్లకూ అంతులేదు. ఆ బాధలు భరించలేక వాళ్లు ప్రభువుకి మొరపెట్టుకున్నారు. యిప్రాయేలీయులు బానిసతనాన మునిగి మూలుగుతూ సహాయంకొరకు ప్రభువుకి మొరపెట్టుకొన్నారు. వారి మొర దేవుని చెవిని బడింది, దేవుడువారి మూలుగు విన్నాడు. పూర్వం తాను అబ్రాహాము ఈసాకు యాకోబులతో చేసికొన్న ఒడంబడికను గుర్తుకి తెచ్చుకొన్నాడు. అతడు యిస్రాయేలీయుల దుస్థితినిగాంచి వాళ్ళను కరుణించాడు" - 2, 28-25.

పై వాక్యాల భావం యిది. యిస్రాయేలీయుల మొర ఓ దహన బలిలాగ యావే సన్నిధికి ఎగసిపోయింది. ఆ ప్రభువు పూర్వమే అబ్రాహాము మొదలైన పితరులతో వాగ్దానం చేసికొన్నాడు. ఇప్పుడు ఈ మొర వినగా అతనికి ఆ వాగ్హానం గుర్తుకు వచ్చింది. పూర్వం కయీను హేబెలుని అన్యాయంగా చంపాడు. అప్పుడు హేబెలు నెత్తురు మా యన్న చేసిన అన్యాయం చూడమని దేవునికి మొరపెట్టింది. - ఆది 4,10. ఆలాంటి మొరే ఇది కూడాను. కనుక యావేకి యిప్రాయేలీయులమీద జాలి వేసింది. వాళ్ళను ఏ విధంగానైనాసరే రక్షించాలని నిర్ణయించుకొన్నాడు. ఆ ప్రభువు జాలిగుండెలు కలవాడు గనుక తనలోతాను ఈలా అనుకొన్నాడు. "ఐగుప్తదేశంలో నా ప్రజలు అనుభవించే బాధలు కన్నులార చూచాను. దాసాధ్యక్షుల బారినుండి విడిపించమని వాళ్లు చేసిన మనవి విన్నాను. వాళ్లు పదే పాట్ల గుర్తించాను. ఐగుప్తీయుల ఇనుప పిడికిళ్ళనుండి వాళ్ళను విడిపించడానికై క్రిందికి దిగివచ్చాను. వాళ్ళను ఈ దేశంనుండి పాలు తేనెలు పారే మరో దేశానికి తీసికొని వెత్తాను. యిప్రాయేలీయుల మొర నా చెవిని బడింది. ఐగుప్తియులు వీళ్ళనేలా పీడిస్తున్నారో కన్నులార చూచాను" -3,7-9.

కనుక యావే ప్రభువు మోషేను పిల్చి అతన్నికార్యనిర్వహకుణ్ణిగా నియమించాడు. ఐగుప్తనుండి యిప్రాయేలీయులను వెలుపలికి తీసికొనిరావడానికై అతన్ని ఫరోవద్దకు పంపాడు. యిస్రాయేలీయులకు ఇతనిద్వారా స్వేచ్చ రావాలి. అహరోను మోషేకు సహాయకుడు. యావే తన సేవకులైన మోషే అహరోనుల ద్వారా తొమ్మిది అద్భుతకార్యాలు చేసాడు. అవి నీరు నెత్తురుగా మారడం, కప్పలు వచ్చిపడటం, దోమపోటు, ఈగపోటు, పశునాశం, బొబ్బలు పొక్కడం, వడగండ్ల వాన, మిడతల దండు, చీకట్ల అలముకోవడం. కాని ఈ యరిష్ణాల వలన ఫరో గుండె కరుగలేదు. పైపెచ్చు అతడు హృదయాన్నిరాయి చేసికొన్నాడు. కఠిన హృదయుడై యిప్రాయేలీయులను ఇంకా అదనంగా బాధించాడు.

అప్పుడు ప్రభువు. ఫరోను లొంగదీయడానికై “యిస్రాయేలు నా కుమారుని క్రింద లెక్క. అతడు నాకు మొట్టమొదట పట్టినవాడు. నన్నారాధించడానికి నా కుమారుణ్ణి