పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రీస్తు ప్రజలను ఆజ్ఞాపింప గల్గుతూన్నాం. కనుక క్రైస్తవ నాయకులు అహంభావంతో గాదు, వినయంతో ప్రవర్తించాలి. స్వార్థబుద్ధితో గాదు, క్రీస్తు బుద్దితో అధికారం నిర్వహించాలి.

ఓ యజమానునికి ఓ సేవకుడుండేవాడు. అతడు యజమానుని ఆస్తిపాస్తులను పరామర్శిస్తూండేవాడు. కాని ఆ సేవకుడు స్వామి సాత్తు దుర్వినియోగం చేస్తున్నాడని ఫిర్యాదులు వచ్చాయి. కనుక యజమానుడు అతనితో "ఓయి! ఖచ్చితంగా లెక్కలొప్పజెప్పు, ఇక నీవు నా కొలువులో ఉండదగవు" అన్నాడు — లూకా 16,2. ఈలాగే ప్రభువు కూడ మన నాయకత్వాన్ని గూర్చి ఓనాడు నిశితమైన లెక్క అడుగుతాడు. మన ప్రవర్తనం ఆ లెక్క ఒప్పజెప్పడానికి తగినట్లుగా వుండాలి. ఆలా వుందా?

నాయకులైన వాళ్ళ అధికారవిభజనం గూడ ఓ ముఖ్య విషయమని గుర్తించాలి. ఐగుప్తనుండి వెడలి వచ్చిన యిస్రాయేలు ప్రజలందరకు మోషే నాయకుడు. వాళ్ళందరూ తమ తగాదాలను మోషేవద్ద వినిపించేవాళ్లు. ఆ తగాదాలన్నీ తీర్చలేక మోషే విసిగి వేసారిపోయేవాడు. ఇది చూచి మోషే మామ యిత్రో "ఈ పనంతా నీవొక్కడవే చేయలేవు. నీ క్రింద కొంతమంది పెద్దలను నియమించు. నీకు మారుగా వాళ్ళు ఈ తగాదాలన్నీ పరిష్కరిస్తారు" అని సలహా యిచ్చాడు - నిర్గ18,21. మోషే యీ సలహాను పాటించాడు. నాయకుడు తన అధికారాన్ని యితరులకు పంచిపెట్టడమంటే యిదే. కొంతమంది నాయకులు తమ అధికారాన్ని ఇతరులకు పంచియిూయరు. తామే అన్ని పనులూ చేయగోరుతారు. ఈలాంటివాళ్లు ఎక్కువకాలం మనలేరు. నాయకుడు తన అధికారాన్ని యితరులకు పంచియిసూండాలి. ఇతరుల ద్వారా తన పనిని కొనసాగించుకొంటూ పోతుండాలి. అసలు అనుచరులు చేయగలిగిన పనిని నాయకుడు తాను చేయనేకూడదు. తొలినాటి యెరూషలేము సమాజంలో ఓ చిన్న తగాదా వచ్చింది. పేద ప్రజలకు కూడూగుడ్డా పంచియిచ్చేకాడ పేచీలు వచ్చాయి. పేత్రు ఆతగాదాను ఈలా పరిష్కరించాడు. అపోస్తలులు పేద ప్రజలను పరామర్శించడము మానుకొని ప్రార్ధనకూ, ప్రభు వార్తాప్రచారానికీ పూనుకొన్నారు. కూడూగుడ్డా మొదలైన వ్యవహారాలను చూడ్డానికి ఏడ్గురు పరిచారకులను నియమించారు. ఇక్కడ అపోస్తలులు తమ అధికారాన్ని ఈ యేడురికీ పంచియిచ్చారు - అచ 6, 1–4. ఈలాగే నాయకులు కూడ ప్రవర్తించాలి.

2. అధికార విసర్జనం

మన నాయకులు చాలమంది అధికార విసర్జనానికి ఒప్పుకోరు. తాము లేకపోతే ఆ పని జరగదు అన్నట్లు ప్రవర్తిస్తుంటారు. కాని బైబులునాయకులు సంతోషంతో అధికార విసర్జనం చేసారు. మోషే మహానాయకుడు. సీనాయి పర్వతంమీద ప్రభువును దర్శించి,