పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పనులకూ, తోడి ప్రజలకూ, భగవంతునికీ మనం చెల్లించవలసిన బాధ్యతలను చెల్లిస్తే చాలు, పుణ్యాత్ములమై పోతాం.

ఈ బాధ్యతా నిర్వహణంలో క్రీస్తే మన ఆదర్శం. అతని బాధ్యతను నూత్నవేదం ఓ చిన్న మాటలో వ్యక్తం చేసింది. ఆ మాట “ఆవశ్యకం" (గ్రీకు భాషలో "దేయి"). అతడు చిన్ననాడే "నేను నా తండ్రి పనిలో నిమగ్నుణ్ణ్తెవుండడం ఆవశ్యకం గాదా?" అని అడిగాడు - లూకా 2, 49. తరువాత జీవితమంతా గూడ “తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే తన భోజనం" అనుకొన్నాడు - యూహా 4,34. అటుపిమ్మట "క్రీస్తు మొదట శ్రమలనుభవించి ఆ తరువాత మహిమలో ప్రవేశించడం ఆవశ్యకం గాదా" అని తలంచాడు - లూకా 24,26. ఈలా తండ్రి ఆజ్ఞకు బదుడై జీవించడమే క్రీస్తు బాధ్యతా నిర్వహణం. ఆ ప్రభుని ఆదర్శంగా బెట్టుకొని క్త్రెస్తవ నాయకులు గూడ బాధ్యతాబదులు కావాలి. క్రమం తప్పని బాధ్యతాయుత జీవితం క్రైస్తవ నాయకునికి పెట్టని పరీక్ష వైద్యుడు, నర్సు, ఉపాధ్యాయుడు, విద్యార్థి, అధికారి, గుమాసా - ఈలా మన చుటూ పనిచేసేవాళ్ళంతా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారా అని పరీక్షిస్తుంటాం గదా! క్రైస్తవ నాయకునికి గూడ ఇదే పరీక్ష చెల్లుతుంది. ఈ బాధ్యతను కూడ తప్పనిసరియైగాదు, ప్రేమభావంతోను సేవాభావంతోను నిర్వర్తించాలి.

3. ఒంటరితనం

ఒకోమారు బంధువులూ మిత్రులూ మనలను చేయి విడుస్తారు. అప్పడు మనం ఒంటరిగా ఉండిపోతాం. ఇక్కడ ఒంటరితనమంటే ఈ బంధుపరిత్యాగం గాదు. ప్రభు సేవకోసం బుద్ధిపూర్వకంగానే ఒంటరితనాన్ని అవలంబించడం. కొన్ని ఉదాహరణలు చూద్దాం. క్రీస్తు ఎవరి ఆశ్రయాన్ని కోరుకోలేదు. క్రీస్తు ఒంటరితనం ఏలాంటిదంటే అతనికి తల దాచుకొనే తావైనా లేకపోయింది - మత్త 8,20. ఓమారు ఎవరో వచ్చి "మీ సోదరులూ తల్లీ మీ కొరకు వెలుపల వేచివున్నా" రని చెప్పగా ప్రభువు "నా సోదరు లెవరు? తల్లి యెవరు? అని ప్రశ్నించాడు - మత్త 12, 48. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కొరకు అతడు బుద్ధిపూర్వకంగా ఒంటరిగాడై పోయాడు. పౌలునకు తన క్రైస్తవ సమాజాలంటే పరమ ప్రీతి. తీతు మొదలైన శిష్యవర్గమన్నా అత్యాదరం. ఐనా అతడు క్రీస్తు కొరకు,ఆ క్రీస్తును బోధించడం కొరకు తన జనాన్నందరిని విడిచి ఒంటరివా డయ్యాడు. మోషేకు అతని అన్నయైన అహరోను, శిష్యుడైన యోషువా సహచరులు. ఐనా అతడు వాళ్ళిద్దరిని గూడవదలిపెట్టియావే సాన్నిధ్యం కలిగించుకొనేందుకు ఒంటరిగా ఉండిపోయాడు.

మామూలుగా మన నాయకులు ఒంటరితనానికి భయపడుతూంటారు. ఒంటిగాడికి బలం వుండదు గదా? అందుచేత న్యాయమైనా కాకపోయినాసరే ఏ పక్షంతోనో