పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4. నాయకుని పరీక్షలు

నాయకత్వపు తర్ఫీదు పొందడమంటే ముఖ్యంగా పరీక్షలకు గురిగావడమే. పరీక్షలకు గురిగానివాళ్ళకు గూడ పెద్ద బాధ్యతలను ఒప్పజెప్పడమనేది క్రైస్తవ సమాజాల అపజయానికి ఓ కారణం అనాలి. కొంతమంది పరీక్షలను జాగ్రత్తగా తప్పకొంటూంటారు. ఈలా పరీక్షలను నేర్పుతో తప్పకొనేవాళ్ళ నాయకత్వానికి తగరు. పెద్ద శోధనలు వచ్చినపుడు వాళ్లు తట్టుకోలేరు.

పిశాచంచే శోధింప బడడానికై ఆత్మ క్రీస్తును ఎడారికి తోడ్మొనిపోయింది - మత్త 4,1. పిశాచంచే పేత్రు జల్లెడలోని ధాన్యంలాగ జల్లించబడ్డాడు - లూకా 22,31. అబ్రాహాము, మోషే, దావీదు, యేలీయూ, పౌలు - దైవ నాయకులంతా పరీక్షలకు గురైనవాళ్లే. క్రైస్తవ నాయకులకు పరీక్షలు మామూలుగా నాల్ల రూపాల్లో వసూంటాయి. అవి శ్రమలు, బాధ్యతా నిర్వహణం, ఒంటరితనం, అపజయాలు. వీటిని గూర్చి క్రమంగా విచారిద్దాం.

1.శ్రమలు

దేవుడు ఐగుప్తనకు ఓ మంత్రినీ, యిస్రాయేలు ప్రజకు ఓ రాజునూ నియమించాలి అనుకొన్నపుడు ఆ యిద్దరికీ శ్రమల ద్వారా తర్ఫీదు నిచ్చాడు. అన్నలు యోసేపునకు పెట్టిన బాధలు,సౌలు దావీదునకు కలిగించిన శ్రమలు మనకు తెలుసు. "మీరు కొంతకాలం శ్రమలు అనుభవించాక ప్రభువు మిమ్ము బలపరచి స్థిరపరుస్తాడు" అని వ్రాసాడు పేత్రు - 1 పే 5,10. శ్రమలు లేందే దేవుని వరప్రసాదం పొందలేం. క్రీస్తు కూడ మొదట శ్రమలనుభవించి అటుపిమ్మట మహిమలో అడుగుపెట్టాలని ప్రవక్తలు వ్రాసారు — లూకా 24,26. గురువు కొక మార్గమూ శిష్యుల కింకొక మార్గమూ వుంటుందా? ఈ శ్రమలు కూడ నానా రూపాల్లో వస్తూంటాయి. ఏ రూపంలో వచ్చినా అవి మనకు అప్రియమూ బాధా కలిగించి తీరతాయి. వాటిల్లోని ప్రధాన లక్షణమే అది. ఐనా ఈ శ్రమలనే పరీక్షలో నెగ్గితేనేగాని మనం నాయకత్వం వహించడానికి సమర్ధులంగాము.

2. బాధ్యతా నిర్వహణం

మనం చేయవలసిన పనిని క్రమంగా చేయడమే బాధ్యతా నిర్వహణం. ఇది ఒకనాటితో తీరిపోదు. జీవితాంతమూ ఉంటుంది. చాలమంది క్రైస్తవ నాయకులు బద్దకింపువలన తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించరు. బాధ్యతనిర్వహణ మనేది పెద్ద బాధ. ఐనా దైనందిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేవాడు నిజమైన నాయకుడు, గొప్ప నాయకుడు గూడ. ఈలా నిర్వర్తించనివాడు తన నాయకత్వం కోల్పోయినట్లే, మన