పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెళ్ళగొట్టడానికీ ప్రభువు వాళ్లను పంపేవాడు - మార్కు 3,14. మూడేండ్ల తర్ఫీదు కాలామూ క్రీస్తు శిష్యులను తన చెంతనే వుంచుకొన్నాడు. అతడు ఆయా పనులను చేసి చూపిస్తూ ఆయా వస్తువులను ఉపమానంగా ప్రదర్శిస్తూ శిష్యులకు బోధించేవాడు. చేపలుపట్టే పడవను జూపుతూ నరులనే చేపలను పట్టాలి అన్నాడు. పంటపోలాలగుండా సాగిపోతూ దైవ ప్రజలనే పంటను సేకరించడానికై ప్రేషితులనే కోతగాళ్లు ముందుకి రావాలన్నాడు. గొర్రెల మందలను చూపిస్తూ దిక్మూమొక్కూ లేక గొర్రెల మందల్లాగ చెల్లాచెదరైయున్న ప్రజల మీద తనకు జాలి కలుగుతుందన్నాడు. స్వయంగా శిష్యుల పాదాలు కడిగిచూపించి సేవాభావం ఏలా వుండాలో వివరించాడు, ఈలా క్రీస్తు స్వయంగా ఆదరించి చూపిస్తూ శిష్యులకు ఆయాసత్యాలు బోధించేవాడు. అతడు మొదట ఆచరించి అటుపిమ్మట బోధించిన అంశాలను తెలియజేయడానికే లూకా సువిశేషం వ్రాసాడు - అచ 1,1. ఇందు చేతనే క్రీస్తు బోధలు శిష్యుల హృదయాల మీద చెరగని ముద్రవేసాయి. నేడు మననాయకులు కొన్ని సిద్ధాంతాలు బోధిస్తారు గాని, వాటిని స్వయంగా ఆచరించరు. అందుకే ప్రజలు మన నాయకులను నమ్మరు, గౌరవించరు గూడ.

క్రీస్తు శిష్యులను దైవరాజ్యాన్నిగూర్చి బోధించడానికో, రోగుల వ్యాధులు నయంచేయడానికో, దయ్యాలను వెళ్ళగొట్టడానికో పంపిస్తూండేవాడు. ఈ కార్యాల ద్వారా వాళ్ళ అనుభవం గడించేవాళ్ళ ఈ పనులను ముగించుకొని వచ్చాక ప్రభువు వాళ్ళను ఏకాంతస్థలానికి తీసికొనివెళ్ళి తన తండ్రినిగూర్చీ తన మరణికోత్తానాలనుగూర్చీ బోధించేవాడు - మార్కు 6,30-31. ప్రభువు ఆయా పనులు చేసి చూపిస్తూ శిష్యులకు బోధించేవాడన్నాం. వారిచేతగూడ వారిచేత గూద స్వయంగా అభ్యాసం చేయించేవాడన్నాం. అటుపిమ్మట వారికి ఏకాంతంగా బోధించేవాడన్నాం. ఇవన్నీ నాయకులను తయారుచేసే పద్ధతులు. క్రీస్తు శిష్యుడైన పౌలు కూడ ఈ పద్ధతులనే అవలంబించాడు. అతడు తీతు, తిమోతి, సిల్వాను మొదలైన శిష్యులకు తర్ఫీదు నిచ్చాడు. వాళ్లు పౌలు గతించాక అతని పనిని కొనసాగించారు. క్త్రెస్తవ నాయకులను తయారుచేసే విధానం ఇది.

దురదృష్టవశాత్తు నేడు మనం కట్టడాలను నిర్మించడంలో చూసే శ్రద్ధ ప్రజలకు తర్ఫీదు నిచ్చి క్రైస్తవ నాయకులను తయారు చేయడంలో చూపం. ఓ తావులో క్రొత్తగా తిరుసభను నిర్మించడమంటే అక్కడ క్త్రెస్తవ నాయకులను తయారు చేయడంగాక, కొన్ని భవనాలను నిర్మించడం అని భావిస్తూంటాం. ఐనా మొదటి కట్టడమూ మొదటి దేవాలయమూ రాతితోనో సిమెంటుతోనో కట్టే భవనం కాదు, నరుని హృదయం. ప్రజల హృదయాలను తయారుచేయందే కట్టడాలను నిర్మించడం ద్వారా దైవ రాజ్యాన్ని నెలకొల్పలేం. కట్టడాలు వద్దని గాదు. వాటి విలువ వాటికే వుంటుంది. కాని ప్రజలకు