పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నియమించాలో అతనికి తెలియలేదు. కనుక అతడు ప్రభువు నుద్దేశించి "సకల ఆత్మలకూ ప్రాణులకూ దేవుడవైన ప్రభూ! ఈ ప్రజల కొక నాయకుని నియమించు" అని ప్రార్థించాడు - సంఖ్యా 27, 16, ఆలాగే క్రీస్తు కూడ శిష్యులను ఎన్నుకోకముందు ఓ రాత్రంతా తండ్రిని ప్రార్ధించాడు - లూకా 6,12. భ్రష్టుడై పోయిన యూదా స్థానాన్ని పొందడం కోసమై మత్తీయా, బర్నబా అనే యిద్దరు వ్యక్తులు పోటీకి నిలువగా, వారిలో యోగ్యడైనవాణ్ణి ఎన్నుకొమ్మని అపోస్తలులు ప్రభువును ప్రార్థించారు – అచ 123–26.

రెండవది, ఈ పదవికి ఎవరు అరలా అని జాగ్రత్తగా విచారించి చూడాలి. పదవిని పొందడానికి అరులనబడినవాళ్ళ ఆధ్యాత్మిక గుణగణాలను జాగ్రత్తగా పరిశీలించి చూడాలి. ఇది కూడ ఒకరిద్దరు కాదు - ఒక కమిటీ లేక భాధ్యతగల కొందరు సభ్యులు పరిశీలన చేయాలి. పౌలు తన శిష్యుడైన తిమోతికి వ్రాసూ "తొందరపడి ఎవరిమీద బడితే వాళ్ళమీద చేతులు చాచవద్దు" అని హెచ్చరించాడు - 1తిమొ5,22.

ఈలా ప్రార్థన గుణపరిశీలన అనేవాని ద్వారా నాయకులను ఎన్నుకోవాలి. ఆలా కాకుండ పక్షపాతం కొద్ది మన యిష్టం వచ్చిన నాయకులను ఎన్నుకొంటే లాభంలేదు. మనకిష్టమైనవాళ్ళ దేవునికిష్టమైన నాయకులు కావచ్చు, కాకపోవచ్చుగూడ, ప్రభుసమాజం నానా అవయవాలతో గూడిన దేహం లాంటిది. ఏ అవయవానికి ఏ బాధ్యత అప్పజెప్పాలో ఆ ప్రభువుకే తెలుసు, పైగా ఆ ప్రభువు ఆత్మ కూడ భిన్నవ్యక్తులకు భిన్నభిన్న వరాలు ఇస్తుంది. కనుక ఆ ప్రభువునకు ఇష్టమైన నాయకులను ఎన్నుకొన్నపుడు మన అక్కరలు తీరతాయి. అతని కిష్టంగాని నాయకులను ఎన్నుకొన్నపుడు మన అక్కరలు తీరవుగదా, క్రొత్త సమస్యలు పుట్టుక వస్తాయి. అందుచేత ఉత్తముడూ భగవంతునికి ప్రీతిపాత్రుడూ ఐన నాయకుని ఎన్నుకొన్న సమాజాలు దైవాశీర్వాదాన్ని పొందుతాయి.

3. నాయకుని తర్ఫీదు

పుట్టుకతోనే నాయకులుగా పట్టేవాళ్లు లేక పోలేదుగాని, ఆలాంటి వాళ్లు చాలా అరుదు. అధిక సంఖ్యాకులు తర్ఫీదు వల్ల నాయకులౌతూంటారు. క్రీస్తకూడ తన శిష్యులకు తర్ఫీదు నిచ్చి వాళ్ళను నాయకులనుగా తయారుచేసాడు. ఈ యధ్యాయంలో మూడంశాలు విచారిద్దాం. శిష్యులకు తర్ఫీదు నీయడంలో క్రీస్తు అవలంబించిన పద్ధతి, క్రీస్తబోధ, క్రీస్తు మాతృక.

1. క్రీస్తు పద్దతి

క్రీస్తు పన్నెండు మందిని శిష్యులనుగా నియమించాడు. వాళ్లు అతనితోనే వుండేవాళ్లు, జనులకు బోధించడానికీ, రోగుల వ్యాధులు నయంజేయడానికీ, దయ్యాలను