పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జంతువులన్నిటిలోను జిత్తులమారిది - 3,1. పాము రూపంలో వచ్చిన పిశాచం నరుణ్ణిచూచి అసూయపడింది. నరుణ్ణి ద్వేషించింది. అతని పతనానికి పునాదులు త్రవ్వింది - జ్ఞాన 2, 24. దేవుడు నరుణ్ణి ఆదరంతో చూస్తూవున్నాడు. కనుక ఈ నరునికి హాని చేసినట్లయితే దేవునికే హాని చేసినట్లవుతుంది. ఆదామును కూలద్రోయడంలో పిశాచం సంకల్పం ఇదే.

ఆదాము, ఏవ, పిశాచం - ఈ ముగ్గురిలో పిశాచం సంకల్పం చాల దుష్టమైంది. కనుకనే ప్రభువు ఆదామేవల కంటే పిశాచాన్ని అధికంగా శిక్షించాడు. ఈ శిక్షా ఫలితంగా స్త్రీకిని స్త్రీ సంతతికిని పిశాచంతో తీరనివైరం కలుగుతుంది. ఈ వైరంలో పిశాచం ఓడిపోయింది. దాని తల చిదికి పోయింది - 3,15, ఈలా వోడిపోవడమనేది పిశాచానికి ఫటోరపరాజయం, సహింపరాని గర్భభంగం. ఇక పిశాచమో స్త్రీసంతతియొక్క మడమలు కరునూనే వుంటుంది! ఔను, మనం పావం చేసినవ్పడెల్ల పిశాచ బాధితులమౌతూనేవుంటాం. (ఇక్కడ మనవాళ్ళ చాలమంది "పిశాచి" అంటూవుంటారు. ఇది పొరపాటు, పిశాచం అనే అనాలి.)

9. జ్ఞానం ఆదామును పాపంనుండి విడిపించింది - జ్ఞాన 10,1.

నరుడు పాపం చేసి హతుడై పోయాడు. ఐనా దేవుడు అతన్ని ఉద్ధరించాలనుకున్నాడు. ఈ రక్షణ ప్రణాళికద్వారా దేవుని దయా, మంచితనమూ వ్యక్తమయ్యాయి. దేవుని మంచితనం నరుని దుష్టత్వాన్ని జయించింది. తన మంచితనం చేత నరుని చెడ్డతనాన్నీ పాపాన్నీ నిర్మూలించాడు ప్రభువు - రోమ 12, 12. అక్కడ ప్రభువు ఆదామేవలను శిక్షించాడంటే అది కేవలం వాళ్ళ మేలుకోసమే. ఇంకా ఘటోరమైన పాపంచేయకుండా వుండడం కోసమే.

ప్రభువు పిశాచంతో “ఆ స్త్రీ సంతతివాళ్ళ నీ తల చిదుక గొడతారు" అన్నాడు. ఈలా పిశాచం తల చితకగొట్టడం లేక పిశాచాన్ని ఓడించడమనేది క్రీస్తు ద్వారా జరిగింది. కనుక ప్రభువు ఆదామును శపించినపుడే కరుణతో ఆదాము సంతతివాళ్ళ రక్షణాన్నిగూడ సూచించాడు. కనుకనే పునీత అగస్తీను "ఆదాము పాపం ధన్యమైంది. ఆ పాపంవల్లనే గదా అంతటి రక్షకుణ్ణి పొందగలిగాం" అని వ్రాసాడు. జ్ఞాన గ్రంథకర్తకూడ ఆదాము పాపాన్ని మననం చేసికుంటూ "జ్ఞానం ఆదామును పాపంనుండి విడిపించింది" అని వ్రాసాడు - 10,1. పూర్వ వేదంలోని యీ జ్ఞానమే నూత్న వేదంలోని క్రీస్తు అనగా తండ్రి అనుగ్రహించిన క్రీస్తువలన ఆదాము పాపం పరిహృతమైంది. ఆదాము సంతతివారలమైన మన పాపాలనుకూడ ఆ ప్రభువు పరిహరిసూ వుండాలని అడుగుకుందాం.

10. మాకు ఓ దేవతను చేసిపెట్టు - నిర్గ 3 2,1.

ఇంతవరకు ఆదికాండం వర్ణించిన ఆదామేవల పాపాన్ని గూర్చి విచారించాం. ఇక యిస్రాయేలు ప్రజలు ఎడారికాలంలో కట్టుకున్న పాపాలను రెండింటిని చూద్దాం.