పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పచ్చుకొనే డబ్బులకూ ఖచ్చితంగా లెక్క ఒప్పజెపుతాడు. వేషాలూ నటనామానుకొంటాడు. మనం కొలిచే దేవుడు సత్యాన్ని ప్రేమించే దేవుడనీ మన అంతరంగంలోని సత్యాన్నిజూచి మెచ్చుకొనే దేవుడనీ, గుర్తిస్తాడు - కీర్త 51,6.

    యిప్రాయేలు ప్రజల నాయకుడైన మోషే, ఐగుప్న మంత్రియైన యొసేపూ, దావీదురాజూ ఈ లాంటి నిజాయితీపరులు. ఎవరిని నాయకులనుగా నియమించాలి అనే సందేహం కలిగినప్పడు ఎవరిలో ఈ నిజాయితీ కన్పిస్తుందో వాళ్ళనే ఎన్నుకోవాలి. ఋజువర్తనుడైన నాయకుడు స్వల్ప విషయాల్లోను గొప్ప విషయాల్లోను నిజాయితీ చూపుతూనే వుంటాడు. కనుక జీవితంలోని సామాన్య సన్నివేశాలను పరిశీలించిగూడ ఎవడు నిజాయితీపరుడో ఎవడు కాడో నిర్ణయించవచ్చు

3.వివేకం

  ఆధ్యాత్మిక పరిణతిగల నాయకుని కుండవలసిన మూడవగుణం వివేకం, పౌలు ఫిలిప్పియుల కొరకు ప్రార్థిస్తూ వారి జ్ఞానము వివేకమూ పెంపజెందాలని కోరుకొన్నాడు -ఫిలి 19. ఆలాగే కొలోస్సీయులు కూడ ఆధ్యాత్మికమైన జ్ఞానమూ వివేకమూ ఆర్థించాలని ప్రార్థించాడు - కొలో 1,9. అతడు వివేకమనే గుణాన్ని చాల గొప్పగా ఎంచాడు. ఓ మారు మోషే "నీ మార్గాన్ని నాకు చూపించ" మని ప్రభువుని ప్రార్థించాడు - నిర్గ 33, 13. అందుకు ప్రభువు తన మార్గాలను మోషేకు బోధించాడు- కీర్త 108,7. ఈ లానాయకులు ప్రభుమార్గాలను తెలిసికొనివుండాలి. 
 మనంతట మనకు వివేకం చాలదు. కనుక దానికోసం ప్రభువును ప్రార్థించాలి. వివేకం చాలనివాళ్ళ ప్రభువును అడుగుకొంటే అతడా వరాన్ని ప్రసాదిస్తాడు అని చెపుతుంది యాకోబు జాబు 1,5. ఆలాగే కీర్తన 25,9 ప్రభువు తన మార్గాలనూ తన న్యాయాలనూ వినయవంతులకు బోధిస్తాడని చెప్తుంది. ఎవరు పరిశుద్దాత్మకు వశవర్తు లౌతుంటారో వాళ్ళను ఆయాత్మే నడిపిస్తూంటుంది. - యొహా 16, 13. ప్రభువు ఓ మారు గిబ్యోను వద్ద సోలోమోనుకు ప్రత్యక్షమై నీ యిష్టం వచ్చిన వరం కోరుకొమ్మన్నాడు. ఆ రాజు “మంచి చెడ్డల భేదం తెలిసికొని తన ప్రజలను వివేకంతో పరిపాలించే భాగ్యం" అడుగుకొన్నాడు - 2 రాజు 3,9. వివేకం కొరకు ప్రభువును ప్రార్ధించడమంటే యిదే. ప్రభువు గ్రంథాన్ని చదువుకొనే వాళ్ళకీ చదువుకొని మననం చేసుకొనేవాళ్ళకీ ఈ వివేకంమీద కోరిక పడుతుంది. క్రైస్తవ నాయకుడు నిత్యమూ ఏది మంచో ఏది చెడో పరీక్షించి తెలిసికొంటూండాలి. కనుక అతనికి ఈ వివేకం అత్యవసరం. 
   క్రీస్తు ఎన్నుకొనిన నాయకుల్లో యూదాకూడ ఒకడు. ఐనా అతనిలో పైన మనం పేర్కొనిన లక్షణాలు లేవు. స్థిరచిత్తతలేదు. అతని మనసు మొదట క్రీస్తుమీద లగ్నమైయుండేదిగాని అటుపిమ్మట వైదొలగింది. నిజాయితీ లేదు. కాసులకు