పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పెద్ద విలువ పెట్టి కొనబడినవాళ్ల” అన్న పౌలు వాక్యాన్ని అర్థం చేసికోవడం - 1 కొ 6,19. ఈలా క్రీస్తునందు నెలకొని వుండడమనేది నాయకునికి అత్యవసరం. స్థిరచితుడైన నాయకుడు భయానికి తావీయడు. "మీ హృదయాలను భయపడనీయకండి" అన్నప్రభువు అభయవాక్యాలను నమ్ముతూంటాడు - యోహా 14,1. యెషయా 9,6 “ప్రభువు తన ప్రభుతను తన భుజాలమీదనే భరిస్తాడు" అని చెప్పంది. అనగా మంచి చెడ్డలూ కష్టసుఖాలూ అన్నీ అతని చేతిలోనేవుంటాయి. కనుక క్రైస్తవనాయకుడు విషమ పరిస్థితులకు చలించడు. ప్రభువునందు నమ్మిక పెట్టుకొని జీవిస్తూంటాడు. ప్రభువు తన తరపున తాను అతన్నిగూర్చి జాగ్రత్తపడుతూంటాడుగూడ -1 పేత్రు 5,7.

       నాయకునికి అన్ని సమస్యలూ అర్థంకావు. కొన్ని సమస్యలకు పరిష్కార మార్గంకూడ తెలియదు. ఐనా అతడు ప్రభువుని అనుమానింపడు. దేవుణ్ణి నమ్మకొని చిక్కుల్లో బడ్డానే అని సంశయింపడు. "నన్ను అనుమానింపని నరుడు ధన్యుడు" అన్న ప్రభువాక్యం అతనికి చీకటిలో గూడ వెలుగును చూపుతూంటుంది - మత్త 11,6. అచ 20.23 లో పౌలు, యెరూషలేములో చెరసాలా శ్రమలూ తన కొరకు కాచుకొని వున్నాయని చెప్తాడు. ఐనా అతడు వాటికి జంకనూ లేదు, వెనుదీయునూలేదు. అతడే 1 తెస్చ 3, 3లో శ్రమలకు జంకవద్దనీ క్రీస్తు శిష్యులకు శ్రమలు తప్పవనీ హెచ్చరించాడు. కీర్తన 16,8 "నేను నిత్యం ప్రభుని నా యెదుట నిలుపుకుంటూంటాను. అతడు నా కుడి ప్రక్కన ఉన్నాడు గనుక నేను కలతజెందను" అంటుంది. 1 పేత్రు 5,10 కూడ "మీరు కొద్దిగా బాధలనుభవించినాక ప్రభువే మిమ్మలను సంపూరులనూ శక్తిమంతులనూ స్థిరచిత్తులనూ చేస్తాడని చెప్పంది. కనుక ඝාජ්‍යාද් కలత జెందకుండా వుండడం గూడ స్థిరచిత్తుడైన నాయకుని లక్షణం.
     పైన మనం చూచిన భావాలను బట్టి స్థిరచిత్తుడైన నాయకుడంటే క్రీస్తునందు నెలకొని వుండేవాడు, భయానికి లొంగనివాడు, ప్రభువును అనుమానించనివాడు, కలత జెందనివాడూను. ఈలాంటి మనస్తత్వం క్రైస్తవనాయకునికి అవసరం. ఇదిలేందే ఆధ్యాత్మిక పరిణతి అంటూలేదు.

2.నిజాయితీ క్రైస్తవనాయకుని కుండవలసిన రెండవ గుణం నిజాయితీ. నిజాయితి అంటే మన తలపులకూ మాటలకూ చేతలకూ ఐక్యత కుదరడం. నిజాయితీపరుడు తాను ఆడిన మాట నిలబెట్టుకుంటాడు. తన బాధ్యతలను తాను సక్రమంగా నిర్వర్తిస్తాడు. ఇచ్చే డబ్బులకూ