పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

{center}

8.క్రైస్తవ నాయకత్వం

{center}                                                    బైబులు భాష్యం - 17

విషయసూచిక

1. నాయకుని లక్షణాలు 116
2. నాయకుని నియామకం 122
3. నాయకుని తర్ఫీదు 124
4. నాయకుని పరీక్షలు 127
5. నాయకుని సమస్యలు 130
6. నాయకుని శోధనలు 132
7. నాయకుని సిలువలు 135

1.{center} నాయకుని లక్షణాలు

అన్ని రంగాల్లోలాగే క్రైస్తవ రంగంలో కూడ నాయకులు అత్యవసరం. క్రైస్తవ నాయకుల లక్షణాలు ఏమిటివి? వాళ్ళకు ఏలా తర్ఫీదు ఈయాలి? వాళ్లు ఏలా పనిచేయాలి? - ఈ ప్రశ్నలకు బైబుల్లో నుండి కొన్ని జవాబులు లభిస్తాయి. ఆ జవాబులను ఈ క్రింద సంగ్రహంగా పరిశీలిద్దాం. మొదట క్రైస్తవ నాయకుల లక్షణాలను విచారిద్దాం. ఈ లక్షణాలు ప్రధానంగా మూడు, ఆధ్యాత్మిక పరిణతి, విశ్వాసం, ఆత్మపూర్ణత.

1. ఆధ్యాత్మిక పరిణతి

    తీతు, తిమెతి మొదలైనవాళ్లు క్రైస్తవ ప్రజలకు కాపరులు.పౌలు వీళ్ళకు వ్రాసిన జాబుల్లో నాయకలక్షణాలను కొన్నిటిని ఉదాహరించాడు. ఉదాహరణకు ఈ క్రింది పట్టలను చూడండి. 1. తిమొు 3, 1-13. తీతు 1, 5–9, 1 పేత్రు 5, 1-9. ఈ జాబితాలను బట్టి చూస్తే క్రైస్తవ నాయకుల్లో కొన్ని ముఖ్య గుణాలు వుండాలి. ఈ గుణాలు ముఖ్యంగా మూడు - స్థిరచిత్తత, నిజాయితీ, వివేకం. ఈ మూడు గుణాలు క్రైస్తవ నాయకునికి ఓ

విధమైన ఆధ్యాత్మిక పరిణతిని కలిగిస్తాయి. ఇక ఈ మూడింటిని గూర్చి క్రమంగా విచారిద్దాం. 1. సిరచితత స్థిరచిత్తత అంటే యేమిటి? నాయకుడు క్రీస్తునందు కుదురుకొని వుండడం, క్రీస్తుకు చెంది వుండడం, క్రీస్తును పొందివుండడం. "మీరు మీ సొంతంగాదు, క్రీస్తుచే