పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈలాంటి భక్తిని దేవుడు అంగీకరించడు. అసలు ఇది భక్తి కానేకాదు. కేవలం మన స్వార్థం. ఆ దేవుడి కంటిలో దుమ్ము కొట్టడం, అంతే.

22. తండ్రిని ప్రేమించేవాడు అతని పత్రులనూ ప్రేమిస్తాడు - 1 యోహా 5,1-3

మనకు సృష్టికర్తా మొదట జన్మనిచ్చేవాడూ దేవుడు. కనుక మనం అతన్ని ప్రేమించాలి. కాని ఆ తండ్రికి తన కుమారులందరూ ఇపులే. దేవుడే గనుక మనకు ఇష్టమైతే అతని కుమారులు కూడ ఇష్టంకావాలి. ఇక, క్రీస్తు తండ్రికి సహజపుత్రుడు. నరులు, విశేషంగా జ్ఞానస్నానం పొందినవాళ్లు, అతనికి దత్తపుత్రులు. వీళ్ళల్లో అతడు నెలకొనివుంటాడు. వీళ్ళంటే అతనికి ప్రీతి. కనుక ఈ పుత్రులంతా గూడ మనకు ప్రియపడాలి. ఫలితార్థమేమిటంటే, మనం దేవుణ్ణి చిత్తశుద్ధితో ప్రేమిస్తే అతని పుత్రులైన తోడిజనాన్నిగూడ ప్రేమిస్తాం, తరచుగా మనకు దైవప్రేమ ఉండదు. కనుకనే సోదరప్రేమ కూడ అంతంతమాత్రంగానే వుంటుంది. అసలు దైవప్రేమలోనే సోదరప్రేమ కూడ ఇమిడివుంటుంది. అవి రెండూ వేరువేరు ప్రేమలు కాదు, ఒకే ప్రేమ.

3. పౌలు భావాలు

23. ప్రేమ తోడివారిని భవనంలా కడుతుంది - 1కొ 8,1-3

ఇంతవరకు నల్లరు సువార్తాకారుల భావాలను విలోకించాం. ఇక పౌలు భావాలను పరిశీలిద్దాం.

కొరింతులోని క్రైస్తవులు కొందరు విగ్రహాలకు సమర్పించిన మాంసాన్ని భుజించారు. కాని వాళ్ళ అది పాపమనుకోలేదు, పాపంలో పడలేదు కూడ. వాళ్ళను చూచి మరికొందరు క్రైస్తవులు కూడ అదే మాంసం భుజించారు. కాని వీళ్ళ అది పాపమనుకొన్నారు. కనుక వీళ్ళ ఆ మాంసాన్ని భుజించడం ద్వారా పాపం చేసారు కూడ.

మాంసం తిన్న మొదటివర్గం వాళ్ళ తాము జ్ఞానులమనుకొన్నారు. విగ్రహాలు అసలు దేవుళ్ళే కావు గనుక వాటికర్పించిన మాంసం తిన్నాగూడ పాపంలేదులే అనుకొన్నారు వాళ్ళ భావం నిజమే. కాని ఈ మిడిమిడి జ్ఞానం వల్ల వాళ్ళకి పొగరెక్కింది. వాళ్ళ కొలిమితిత్తుల్లా ఉబ్బిపోయారు. కనుక జ్ఞానం వల్ల కలిగే అనర్థం బడాయితో విర్రవీగడం - 1కొ 8,9-11.

కాని సోదరప్రేమ ఈలా చేయదు. అది భవనాన్ని కట్టినట్లుగా క్రైస్తవ సమాజాన్ని కట్టుకొంటూపోతుంది. అనగా క్రైస్తవ సమాజాన్ని వృద్ధిలోకి తెస్తుంది. ఆ సమాజ వ్యక్తుల