పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొరకు క్రీస్తుని పంపాడు - యోహా 3,16. మనతరపున మనం కూడ ఏలా ప్రేమించాలో నేర్పాడు. కనుక మనం కృతజ్ఞతా పూర్వకంగా అతనికి బదులు ప్రేమ చూపించాలి.

కాని దేవునికి బదులు ప్రేమ చూపించాలంటే అతడు మన కంటికి కన్పించేవాడు కాదు. మరి మన బాకీ ఏలా తీర్చుకొంటాం? దేవుడు మనకు కన్పించకపోయినా తోడినరులు కన్పిస్తూనేవుంటారు. వాళ్ళను ప్రేమిస్తే దేవుడు తన్ను ప్రేమించినట్లే భావిస్తాడు. కనుక దేవుని పట్ల మనం చూపవలసిన ప్రేమను తోడిజనుల పట్ల చూపితే చాలు, మన ఋణం తీరిపోతుంది. ఎందుకంటే మన కంటబడని దేవుడు తోడినరులరూపంలో కంటబడతాడు.

20. ప్రేమ హృదయునిలో దేవుడు ఉంటాడు - 1యోహా 4,16

క్రీస్తు తండ్రిని ప్రేమించి అతనిలో నెలకొనివుంటాడు. అలాగే శిష్యులు కూడ క్రీస్తుని ప్రేమించి అతనిలో నెలకొని వుంటారు. ప్రేమ సాన్నిధ్యాన్ని తెచ్చిపెడుతుంది. మనం ఎవరిని ప్రేమిస్తామో వాళ్ళ మనకీ, మనం వాళ్ళకీ సన్నిహితులమౌతాం. ఈ సూత్రం ప్రకారం మనం ప్రేమతో జీవిస్తే దేవుడు మనలో వసిస్తాడు. మనమూ అతనిలో వసిస్తాం. సోదరప్రేమ కల మహానుభావుల హృదయంలో భగవంతుడు నెలకొని వుంటాడు. ఇంతకన్న గొప్పభాగ్యం ఏమి కావాలి?

21. అసత్యవాది - 1 ಹಾಪ್ 420-21

కొందరు దేవుణ్ణి ప్రేమిస్తున్నా మనుకొంటారు. గుళ్ళోకి వెళ్ళి దేవునికి మ్రోక్కుతారు. కాని తోడి జనాన్ని మాత్రం అనాదరం చేస్తారు. అలాంటప్పుడు వాళ్ళ దైవభక్తి అంతాగూడ వ్యర్థమే. పైగా వాళ్లు అబద్ధాలకోరకు కూడ. ఎందుకు? సులభమైన కార్యం చేయలేని వాడు కష్టమైన కార్యం చేయలేడు. తోడినరుడు మనకంటికి కన్పిస్తాడు. అతన్ని ఆదరంతో చూడ్డం సులభం. దేవుడు మనకంటికి కన్పించడు. మనకు అందుబాటులో వుండడు. అలాంటివాణ్ణి ఆదరించడం కష్టం. ఇక, సులభమైన కార్యాన్ని చేయలేనివాడు కష్టమైన కార్యాన్ని చేయలేడు కదా! సులభంగా దొరకే తోడి నరుడ్డి పట్టించుకోనివాడు కష్టంతో దొరికే దేవుణ్ణి పట్టించుకొంటాడా? అందుకే యోహాను కంటికి కనుపించే నరుణ్ణి ప్రేమించలేనివాడు కంటికి కనుపించని దేవుణ్ణి ప్రేమించలేడని చెప్పాడు. ఒకవేళ అలాంటివాడు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తే అసత్యవాది ఔతాడు. పిశాచం అబద్దాలన్నిటికీ పుట్టినిల్లు. కనుక అతడు కూడ ఆ పిశాచ మార్గంలో నడచినట్లవుతుంది.

ఒకోమారు తోడినరులను ద్వేషిస్తాం. వారిని పీడిస్తాం. వారికి అపకారం చేస్తాం. ఐనా భగవంతుణ్ణి పుజింపబోతాం. అతనికి కానుకలూ మ్రౌక్కులూ చెల్లిస్తాం. కాని