పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

17. క్రియాపూర్వకమైన ప్రేమ - 1 యో3, 16-18

ప్రేమని మాటల్లో కాక చేతల్లో చూపించాలి. తండ్రి తన ప్రేమను చేతల్లో చూపించాడు. కనుకనే అతడు క్రీస్తుని పంపాడు. ఆ క్రీస్తు కూడ తన ప్రేమని చేతల్లో చూపించాడు. అదే అతని సిలువ మరణం. స్నేహితుల కోసం ప్రాణాలు అర్పించడం కంటె గొప్ప ప్రేమ ఏముందని ప్రభువే అన్నాడు - యోహా 15,13. ఈ తండ్రీకొడుకుల్లాగే మనం కూడ మన ప్రేమను క్రియాపూర్వకంగా చూపించాలి.

పై సూత్రం అన్వయించే ఓ సందర్భం. తోడి జనం అక్కరలో వుంటే, మనం కలవాళ్ళమైతే, తప్పకుండా సహాయం చేయాలి. ప్రేమించడమంటే ఈయడం. ఇతరులకు ఇచ్చినపడే మనప్రేమ యధార్థమైందని రుజువెతుంది. సోదర ప్రేమకీ సాంఘిక న్యాయానికీ చాల దగ్గరి సంబంధం వుంది. మంచి సమరయుడు బాటసారి విూద జాలిపడి అతనికి సహాయం చేసాడు - లూకా 10,34. మనం తోడి జనానికి సేవలు చేయాలనే ప్రభువు ఆజ్ఞ కూడ వుంది - లూకా 22,26. కూడూ గుడ్డా లేని తోడిజనాన్ని ఆదుకొన్నప్పడు మాత్రమే మన విశ్వాసాన్ని క్రియాపూర్వకంగా చూపించినట్లవుతుందని చెప్తుంది యాకోబు జాబు - 2,15-16. ఈ వుదాహరణలన్నిటి భావం ఏమిటంటే సోదరప్రేమను చేతల్లో చూపించాలి. చేతలదాకా రాని ప్రేమ యథార్థమైంది కాదు.

18. దేవుడు ప్రేమస్వరూపుడు - 1 యోహా 4,8

బైబులు చాల అరుదుగా గాని నిర్వచనాలు చెప్పదు. ఆ కొద్దిపాటి నిర్వచనాల్లో పై వాక్యం గూడ ఒకటి. ఈ వాక్యం దేవుడు తన ఆంతరంగిక జీవితంలో ప్రేమమయుడు అని చెప్తుంది. అనగా సృష్టి చేయడం ద్వారా, క్రీస్తుని పంపి పతనమానవుణ్ణి ఉద్ధరించడం ద్వారా దేవుడు ప్రేమమయుడయ్యాడు. ఇక మనం ఆ దేవునికి బిడ్డలం. బిడ్డలు తండ్రిలాగే వండాలి. అతనిలాగే మనంకూడ ప్రేమకార్యాలకు పూనుకోవాలి. లేకపోతే అతనికీ మనకీ పొత్తు కుదరదు. అసలు అతన్ని మనం అర్థం చేసికొన్నట్లే కాదు. ప్రేమద్వారా మనం దేవునిలాంటివాళ్ళం ఔతాం. తండ్రి క్రీస్తుపట్ల చూపే ప్రేమా, క్రీస్తు శిష్యులయెడల చూపే ప్రేమా, ఆ శిష్యులు పరస్పరం చూపుకొనే ప్రేమా - అంతా ఒకటే ప్రేమ. ఆ ప్రేమలో పాలుపొందినవాడే యథార్థ క్రైస్తవుడు.

19. దేవుడే మొదట మనలను ప్రేమించాడు - 1 యోహా, 4,10-12

దేవుడే గనుక మొదట మనలను ప్రేమించకపోతే మనం ఒకరినొకరం ప్రేమించగలిగేవాళ్ళమే కాదు. ఆ తండ్రే మొదట మనలను ప్రేమించాడు. మన విమోచనం