పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిన్న రవ్వపెద్ద అడవిని తగులబెడుతుంది. అలాగే నాలుక కూడ మన దేహాన్నంతటినీ తగులబెడుతుంది. దానితోనే దేవుణ్ణిస్తుతిస్తాం, దానితోనే దేవునికి పోలికగా వుండే నరుడ్డి శపిస్తాం. దాన్ని యెవరూ అదుపులో పెట్టుకోలేరు. రోజూ ఈ నాలుకతో మనం చేసే పాపాలు ఎన్నో

7. సమరయునికి జాలి కలిగింది - లూకా 10,34

యెరికో బాటసారిని దొంగలు గొట్టగా అతడు రోడ్డు ప్రక్కన పడివున్నాడు. దేవాలయంలో ఊడిగం చేసే యాజకుడూ లేవీయుడూ ఆ మార్గం వెంట వచ్చారు. కాని వాళ్ళ అతన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. అటుపిమ్మట సమరయుడు ఆ త్రోవన వచ్చాడు. గాయపడిన వాని దుస్తులు అతడు యూదుడని చెప్పక చెప్తున్నాయి. యూదులకూ సమరయులకూ ఆ యింటిమిది కాకి ఈ యింటిమిూద వాలనంత బద్ధవైరం. కనుక సమరయుడు ఈ యూదుడ్డి పట్టించుకోకుండా వెళ్ళి వుండవచ్చు. ఐనా అతని నిస్సహాయ స్థితిని చూడగా సమరయునికి జాలివేసింది. ఆ పరిస్థితుల్లో ఆ బాటసారిని ఆదుకోకపోతే అతడు తప్పక మరణిస్తాడు. కనుకనే సమరయుడు వాని చెంతకువెళ్ళి అతని గాయాలకు కట్టుకట్టాడు. అతన్ని సత్రానికి తీసుకొనివెళ్ళాడు.

యథార్థమైన సోదరప్రేమ ఉన్నవాడిలో ఈ జాలి తప్పక వుంటుంది. క్రీస్తుకూడ నాయీను విధవాపత్రుని పాడెను మోసికొనిపోతూండగా చూచి జాలిపడ్డాడు - లూకా 7, 13. Es śKórós జీవంతో లేపాడు. యాజకునికీ లేవీయునికీ ఈ జాలి లేదని చెప్పాం. ఇతరుల శ్రమలను చూచినపుడు మనకు మాత్రం జాలి పడుతుందా? ఈ జాలి కలవాళ్ళు తప్పక సేవాకార్యాలకు పూనుకొంటారు. అక్కరలో వున్నవాళ్ళకు మనం చేసే సేవ యేపాటిది?

8.కానుకను పీఠం వద్దనే వదలిపెట్టి - మత్త 5,23-24

మామూలుగా మనం దైవప్రేమను ఘనంగా యెంచి సోదరప్రేమను తేలిక చేస్తామనీ, ఇది పొరపాటనీ చెప్పాం. సోదర ప్రేమ కూడ దైవ ప్రేమంత విలువైందని నుడివాం. నూత్నవేదంలో ఒక్కసందర్భం సోదరప్రేమ దైవప్రేమ కంటె గూడ ఘనమైందని చెప్తుంది. ఇది చాల అరుదైన వాక్యం, దేవుణ్ణి ఆరాధించడానికి దేవళానికి కానుకతో వచ్చాయి. కాని ఇరుగుపొరుగువారిలో ఎవరిమిూదనో మనకు మనస్పర్థ ఉన్నట్లుగా గుర్తుకు వచ్చింది. అప్పుడు దేవుణ్ణి పూజించుకొని వెళ్ళిపోతే చాలదు. ఆ కానుకను పీఠం దగ్గరే వదలిపెట్టి వెళ్ళి ఆ విరోధితో సఖ్యపడిరావాలి. ఆ పిమ్మట దానిని దేవునికి అర్పించవచ్చు.