పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1. సోదరప్రేమ ఆత్మ యిచ్చేవరం

సోదరప్రేమను మనకు ప్రసాదించేది పరిశుద్ధాత్మే "ఆ యాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లోనికి క్రుమ్మరింపబడుతుంది." - రోమా 5,5. ఇది జ్ఞానస్నానంలోనే జరుగుతుంది. సోదర ప్రేమను ప్రసాదించే శక్తి పరిశుద్ధాత్మకనుక, ఈ పుణ్యంలో కొరత కలిగినప్పడెల్లా ఆ యాత్మనే అడుగుకుంటూండాలి. దేహంలోని అవయవాలన్నిటినీ ఆత్మ ఒక్కటిగా బంధించినట్లే క్రైస్తవ ప్రజలనందరినీ పరిశుద్దాత్మ ఒక్క సమాజంగా ఐక్య పరుస్తుంది. కనుక ఆ యాత్మ అనుగ్రహం లేందే మనం ప్రేమజీవితం జీవింపలేం.


2. సోదర ప్రేమకు ఆదర్శం క్రీస్తే

"నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరూ ఒకరినొకరు ప్రేమించండి" అన్న క్రీస్తు వాక్యాన్ని ఆదర్శంగా బెట్టుకొని సోదర ప్రేమను పాటించాలి - యోహా 13,34. కాని క్రీస్తు మనలను ఏ విధంగా ప్రేమించాడు? అతడు దిక్కూ మొక్కూలేక కాపరిలేని మందలా వున్న జనసమూహాలను జూచి కనికరపడ్డాడు. వాళ్ళ కుంటిగ్రుడ్డి చెవిటి తనాన్ని తొలగించాడు. వాళ్ళ వ్యాధిబాధలను పాపాడు. పాపాత్ముల పట్ల ఆ ప్రభువు దయజూపాడు. వ్యభిచారిణి, మంచిదొంగ, మగ్డలీన, పేత్రు మొదలైన పాపులను కరుణతో ఆదరించాడు. తప్పిపోయిన గొర్రెను మంచి కాపరిలాగే తానూ త్రోవ దప్పిపోయిన జనులను నెనరుతో దారికి గొనివచ్చాడు. మరియు మార్త లాజరు మొదలైన స్నేహితులను అనురాగంతో ప్రేమించాడు. తెలివితేటలులేని శిష్యులకు నేర్పుతో ఓర్పుతో పరలోక రాజ్యాన్నిగూర్చి బోధించాడు. అతడు శత్రువులను ద్వేషింపలేదుగదా, వాళ్లపట్ల ఆదరాన్ని సహనాన్ని చూపాడు, వేయేల అతడు అందరినీ అంగీకరించాడు, ఆదరించాడు, ప్రేమించాడు. చివరన తన ప్రాణాన్నే త్యాగంచేసి స్వార్థంలేని ప్రేమతో తోడి నరులకోసం సిలువమీద చనిపోయాడు. ఈ కనికరమూ, దయా, నెనరూ, అనురాగమూ, ఓర్పూ, ద్వేషము లేమీ, స్వార్ధరాహిత్యమూ - క్రీస్తు మనపట్ల చూపిన ప్రేమలోని నానాలక్షణాలు. మనమూ క్రీస్తులా ప్రేమించాలంటే మన సోదరప్రేమలో కూడ పై లక్షణాలు కన్పించాలి. కనుక క్రీస్తును చూచి రోజురోజు మన సోదర ప్రేమను సవరించుకుంటూండాలి. సరిదిద్దుకుంటూండాలి.


3. మూడు ఉపమానాలు

సోదర ప్రేమను ఎందుకు పాటించాలో చెపూ నూత్న వేద రచయితలు ముగ్గురు మూడు ఉపమానాలు వాడారు. యోహాను తన సువిశేషం 15వ అధ్యాయంలో, కొమ్మలు చెట్టతో ఐక్యమైనట్లుగా మనం క్రీస్తుతో ఐక్యమౌతామన్నాడు. పౌలు మొదటి కొరింతీయులు 12వ అధ్యాంయంలో, దేహంలోని అవయవాలు శిరస్సుతో ఐక్యమైనట్లుగా మనం క్రీస్తుతో ఐక్యమౌతామని చెప్పాడు. పేత్రు తాను వ్రాసిన మొదటి జాబు రెండవ అధ్యాయంలో, రాళ్ల మందిరంలోనికి లాగే మనమూ క్రీస్తులోనికి నిర్మింపబడుతూన్నాం అన్నాడు. ఈ మూడు ఉపమానాల్లోను భావం ఒకటే. క్రీస్తుతో ఐక్యమైనవాళ్ళంతా వాళ్ళల్లో వాళ్ళు

97