పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యిస్రాయేలీయులు సురక్షితంగా సాగరం దాటివెళ్లారు. కాని ఐగుప్రీయులు వచ్చినపుడు మాత్రం అంతవరకూ గోడల్లాగనిల్చివున్న నీళ్ల మల్లా కలుసుకొన్నాయి. వాళ్లు నడిసంద్రంలో మునిగి చచ్చారు.

పై రెండు సంప్రదాయాల్లోను యావే సంప్రదాయమే యథార్థంగా జరిగిన సంఘటనను దగ్గరగా వుంటుందని చెప్పాలి. ఇక, ఈ సముద్రోత్తరణంలో అసలు అద్భుతం ఏమిటి? ప్రభువు ప్రకృతి శకులను తన భక్తులకు అనుకూలంగాను ప్రతికూలంగాను మెలిగేలా చేసాడు. యిప్రాయేలీయులు వచ్చినపుడు సముద్రం ఆటులోవుంది. కనుకనే వాళ్ళు దాన్ని సులభంగా దాటిపోగలిగారు. అదే సముద్రం ఐగుప్తియులు వచ్చినపుడు పోటులో వుంది. కనుక వాళ్లు దానిలో మునిగిపోయారు. ఈలా సముద్రం ఆటుపోటుల ద్వారా ప్రభువు ఐగుప్రీయులను శిక్షించి యిప్రాయేలీయులను రక్షించడమే ఇక్కడ అద్భుతం. ఈ యద్భుత కార్యం ఆనాడు యిస్రాయేలీయులకు గొప్ప అనుభూతిని కలిగించింది. కనుకనే పూర్వవేదం చాల తావుల్లో ఈ సంఘటనను ప్రస్తావిస్తుంది.

4. పౌలు హెచ్చరిక

పౌలు నూత్న వేదంలో పై సముద్రోత్తరణాన్ని ప్రస్తావించాడు - 1 కొ 10, 1- 5.11. యిస్రాయేలీయులు సముద్రంగుండా దాటిపోయారు. అదే వాళ్ళ జ్ఞానస్నానం. తర్వాత వాళ్లు ఎడారిలో మన్నాభోజనం భుజించారు. ఐనా వాళ్ళల్లో కొందరు ప్రభువమీద తిరగబడ్డం మానలేదు. కనుక ప్రభువు వాళ్లను ఎడారిలోనే చంపివేసాడు. నేడు ఈ సంఘటనం మనకు హెచ్చరికగా వుండాలి. మన సముద్రోత్తరణం జ్ఞానస్నానం, మన మన్నా దివ్యసత్ప్రసదం. కాని మనం జ్ఞానస్నానం పొందినంత మాత్రాన్నే దివ్య భోజనాన్ని పుచ్చుకొన్నంత మాత్రాన్నే రక్షణం పొందం. ఆ ప్రభువు ఆజ్ఞల ప్రకారం జీవిస్తేనేగాని అతని అనుగ్రహానికి పాత్రులంగాం. లేకపోతే నాశమైపోతాం.

5. నిబంధనం

యిస్రాయేలీయుల చరిత్రలో నిబంధనం ముఖ్యాతిముఖ్యమైన ఘట్టం. కాని యూదుల సీనాయి నిబంధనకు పూర్వమే వారి సమకాలికులైన హితీయజాతివాళ్లు ఒడంబడికలు చేసికొన్నారు. ఆ జాతికి చెందిన ఓ మహారాజు సామంతరాజుతో ఒడంబడిక చేసికొనేవాడు. ఆ మహారాజు సామంత్రుణ్ణి శత్రువులనుండి రక్షించేవాడు. సామంతుడు అతనికి సేవలు చేసేవాడు. ఈ పద్ధతే యిస్రాయేలీయుల నిబంధనలోకూడ కన్పిస్తుంది. ప్రభువు ఓ మహారాజులా వచ్చి యిప్రాయేలీయులను ఐగుప్త దాస్యనుండి రక్షించాడు.