పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పల్మాడు. ఆలాగే నీళ్ళు పాయలయ్యాయి - 14, 21–22. యిప్రాయేలీయులు సముద్ర గర్భంగుండా పొడినేల మీదలాగా నడచి పోయారు. వాళ్ళు పోతూంటే సముద్రంనీళ్లు కుడివైపుగా ఎడమవైపుగా గోడల్లాగ నిల్చివున్నాయి – 14,29.

యూదులను జూచి ఐగుప్రీయులుకూడ ఆరిన సముద్రంగుండా నడవడం మొదలుపెట్టారు. అప్పుడు ప్రభువు సముద్రం ఐగుప్తియులను ముంచివేయాలి అన్నాడు. ఆలాగే జరిగింది. ఇంతసేపూ గోడల్లాగ నిల్చివున్న నీళు ఒక్కపెటున వాళ్ళమీద విరుచుకపడ్డాయి. కనుక ఐగుప్రీయులు నడికడలిలో మునిగి చచ్చారు. - 14,28.

యిస్రాయేలీయులు దాటిపోతూండగా సముద్రం నీళ్లు కుడియెడమలందు గోడల్లాగ నిల్చివున్నాయి అని చెప్తుంది యాజక సంప్రదాయం. యావే సంప్రదాయంలోని 14,24 వలె యాజక సంప్రదాయంలోని 14,29 ముఖ్యాతిముఖ్యమైన వాక్యం. కాని ఇక్కడ నీళ్లు కుడివైపునా ఎడమవైపునా గోడల్లాగ నిల్చి వున్నాయి అంటే ఏమిటి? బైబులు భావాల ప్రకారం సముద్రమూ నీళ్లూ ప్రభువుకి శత్రువులు. కనుక ఈ నీళ్ళను కూడ ప్రభువు విరోధిగా భావించుకోవాలి. ప్రభువు తన సైన్యమైన యిస్రాయేలును తరలించుకొని వస్తూంటే శత్రుశక్తులన్నీదిగ్ర్భాంతి చెందాయి. ప్రమాన్పడి చూస్తున్నాయి. అలాగే ఈ నీళ్లుకూడ యిస్రాయేలును చూచి మనపడ్డి గోడల్లాగ నిల్చిపోయాయి. ఇది భావం. ఐనా ఇది ఉత్రేక్షకాని చరిత్రకాదు.

ఇంతవరకూ మనం చూచిన రెండు సంప్రదాయాల భావాలను సంగ్రహంగా ఈలా చెప్పుకోవచ్చు . అసలు జరిగిన సంగతి యిది.యిప్రాయేలీయులు వచ్చినపుడు సముద్రం "ఆటు" వల్ల ఇంకిపోయి వుంది. అనగా దాని నీళ్లు ప్రక్కకు కదిలిపోయాయి. అలా తీసిపోయిన కడలిగుండా వాళ్ల దాటిపోయారు. కాని వాళ్ల వెనువెంట ఐగుప్రీయులు సాగరంలో ప్రవేశించేప్పటికల్లా “పోటు" వల్ల దాని నీళ్లు మల్లా తిరిగివచ్చాయి. అనగా సముద్రం పొంగులో వుంది. కనుక వాళ్లు ఆ వెల్లవలో మునిగి చచ్చారు. యథార్థంగా జరిగిన సంగతి యిది.

ఈ సంగతిని యావేసంప్రదాయం ఈలా వర్ణించింది. ప్రభువు వేకువజామున ఐగుప్తు దండును కలవరపరిచాడు. ఆ దండు గగ్లోలుపడి తనంతటతానే సముద్రంలో దూకి చచ్చింది. తర్వాత యిస్రాయేలీయులు ఆరిన సముద్రాన్ని దాటి వెళ్లారు.

పై సంగతిని యాజక సంప్రదాయం మరోలా వర్ణించింది. యిప్రాయేలీయులు నీళ్ళగుండ వెళూంటే ఆ నీళ్ళు ఇరువైపుల గోడల్లాగ నిల్చాయి. నీళ్ల దేవుని శత్రువులు కనుక, ఆ దేవుని సైన్యం తరలిపోతుంటే ప్రమాన్పడి చూస్తున్నాయి. ఆరీతిగా