పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంతలో ఐగుప్రీయులు వాళ్ళ వెంటబడి వచ్చారు. యిప్రాయేలును మల్లా వెనక్కు లాగుకొనిపోయి వాళ్ళచేత వెట్టిచాకిరి చేయించుకోవాలని ఫరో కోర్కె. సరే, ఐగుప్త సైన్యంవచ్చి యిప్రాయేలు మీద పడింది. ఆ ప్రజలు ఇరకాటంలో పడ్డారు. వాళ్ళకు ముందు నుయ్యి వెనుక గొయ్యి ఇక యెటూ కదలలేని పరిస్థితితో వున్నారు. ఆ విషమ సమయంలో యావే వాళ్ళ కోపుతీసికొన్నాడు. తాను స్వయంగా వాళ్ళ తరపున పోరాడి ఐగుప్తియులను ఓడించాడు. ఈ పోరాటాన్నియావే సంప్రదాయం ఒకరీతిగాను యాజక సంప్రదాయం మరొక రీతిగాను వర్ణించింది. నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఈ సంప్రదాయాలు రెండూ మిళితమై వున్నాయి. (ఈ సంప్రదాయా లేమిటో, వాటి భావమేమిటో చివరి అధ్యాయంలో పరిశీలిద్దాం). ఇక్కడ మనం మొదట రెల్లసముద్రం వొడ్డున జరిగిన పోరాటాన్ని యావే సంప్రదాయం వర్ణించిన తీరును పరిశీలిద్దాం.

యిస్రాయేలీయులను పట్టుకొని రావడానికి ఫరో రథాలతో వచ్చాడు - 14,5- 7. వాళ్ళను చూడగానే యూదులకు గుండె నీరయింది. అప్పుడు మోషే జనులయెదుట అభయ వాక్యాలు పల్మాడు. యావేను నమ్మమన్నాడు. ప్రభువుమీద భారంవేసి నిమ్మళంగా వండమని హెచ్చరించాడు - 14, 13-14.అంతలో యింతవరకూ ముందు నడుస్తూన్న మేఘస్తంభం వెనుకకు వచ్చి యిస్రాయేలీయులకూ ఐగుప్తియులకూ మధ్య నిలిచింది. అది ఐగుప్రీయులవైపు చీకటినీ యిస్రాయేలీయుల వైపు వెలుగునీ ప్రసరింపజేసింది. కనుక ఆ రాత్రి ఐగుప్రీయులు యిస్రాయేలీయులకు ఏ హానీ చేయలేకపోయారు. మరునాటి వేకువన ప్రభువు మేఘస్తంభంలోనుండి ఐగుప్తు దండును ఉరిమిచూచాడు. దాన్ని కలవరపెట్టాడు - 14,24. దానితో ఐగుప్రీయులు గగోలుపడి చెల్లాచెదరై సముద్రంలో దూకి చచ్చారు. తెల్లవారాక ఐగుప్తియుల శవాలు సముద్రంలో తేలియాడుతూ కన్పించాయి- 14, 27-28.

యావే సంప్రదాయం ప్రకారం రెల్లసముద్రం వొడ్డున పోరాటం జరగనేలేదు. అసలు యిస్రాయేలీయులు వాళ్ళ గూడారాల్లోనుండి బయటికిగూడ రాలేదు. యావే ఐగుప్తీయులను కలవరపెట్టగా వాళ్ళంతట వాళ్ళే వెళ్ళి సముద్రంలో దూకి చచ్చారు. కనుక ఇక్కడ యావే ఐగుప్తియులను కలవరపెట్టాడు అనే 14,24వ వచనం ముఖ్యమైంది.

3. యాజక సంప్రదాయం

పై సంఘటనాన్నియాజక సంప్రదాయం కొంచెం భిన్నంగా వర్ణించింది. యావే పల్కిన పల్కు తప్పకుండా నెరవేరి తీరుతుంది. ప్రభువు మొదట యిస్రాయేలు దాటిపోయేందుకు సముద్రం దారి ఈయాలి అన్నాడు. నీళ్లు పాయలు కావాలి అని