పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



1. యుద్ధ నియమాలు

1. యుద్దానికిముందు ప్రభువుకి గొర్రెపిల్లను బలిగా అర్పించేవాళ్లు - 1 సమూ 7,9. యావేతో సంప్రతించి అతని చిత్తాన్నితెలిసికొనేవాళ్లుకూడ - 2 సమూ 5,22-24.

2. శత్రువులకు భయపడవద్దని యుద్దానికిముందు యాజకుడు ప్రజలకు ఉపదేశం చేసేవాడు - ద్వితీ 20, 1–4. సముద్రాన్ని దాటకముందు మోషే యిస్రాయేలుకుకూడ ఈలాంటి వుపదేశమే చేసాడు - నిర్గమ 14;13-14.

3. పోరాటానికిముందు సైనికులు శుద్ధిచేసికొని వండాలి. యుద్ధకాలంలో వీరులు స్త్రీలను కూడరాదు - 1సమూ 21,5.

4. యుద్ధంలో యావే యిప్రాయేలు సైన్యానికి ముదు నడచి శత్రువులను ఓడించేవాడు. ఆలా అతడు బారాకునకు ముందుగా నడచిపోయి శత్రువైన సిస్రాను ఓడించాడు - న్యాయా 4, 14-16. ఇంకా ప్రభువు పోరాటంలో శత్రుసైన్యాన్ని కలవరపెట్టేవాడు. దీనివల్ల యిస్రాయేలు పోరు ప్రారంభింపకమునుపే శత్రువులు ఓడిపోయేవాళ్లు. ఆ రీతిగా అతడు యోషువా మీదికి దండెత్తి వచ్చిన ఐదుగురు అమోరీయ రాజులను కలవరపెట్టాడు - యోషు 10,9-1 సమూవేలు కాలంలో యిస్రాయేలుమీదికి దండెత్తివచ్చిన ఫిలిస్తీయులను గగోలుపరచాడు - 1సమూ 7,10. మన కథలో మోషే మీదికి దండెత్తి వచ్చిన ఐగుప్రీయులను కలవరపెట్టాడు - నిర్గ 14,24.

5. విజయం యావేదే. కనుక యుద్ధంలో లభించే కొల్ల సొమ్మును యావేకే అర్పించేవాళ్లు. జయించిన నగరాన్నిగూడ శాపంపాలుచేసి నాశం చేసేవాళ్లు. అది యావేకు అర్పింపబడిన బలి అని తలంచేవాళ్లు. ఈ భావంతోనే యోషువా యెరికో పట్టణాన్ని జయించినపుడు దాన్ని సర్వనాశం చేయించాడు - యోషు 6,21.

6. ఇక్కడ ఓ విషయం నొక్కిచెప్పాలి. యావే యుద్దానికి వెళ్లేది రక్త ప్రీతితోగాదు, పీడితులను రక్షించేందుకు. తన భక్తులైన యిస్రాయేలును శత్రువులు పీడిస్తే అతడు సహించి వూరుకోడు. తరచుగా యుద్ధంలో ప్రభువు ఆత్మ ఓయిస్రాయేలు వీరుణ్ణి ఆవేశించేది. ఇక ఆ వీరుడు ప్రజలకు నాయకుడై యుద్దం నడిపేవాడు. అతని ద్వారానే ప్రభువు శత్రువులను హతమార్చేవాడు. సాలు ఈలా అమ్మోనీయులను ఓడించాడు - 1 సమూ 11, 6–7. సంసోను వేయిమంది ఫిలిస్ట్రీయులను చంపాడు - న్యాయా 15, 14-15.

2.యావే సంప్రదాయం

రెల్లు సముద్రంవద్ద ఏమి జరిగింది? యిప్రాయేలీయులు ఐగుప్తనుండి వెడలివచ్చి రెల్లసముద్రం చేరుకొన్నారు. ఆ సముద్రాన్ని ఏలా దాటిపోవాలో వాళ్లకు తెలియలేదు.