పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అతడే - మార్కు 14,22-24. నూత్న వేదం చాల తావుల్లో అతన్ని గొర్రెపిల్లనుగా పేర్కొంటుంది - యోహా 1, 29.

కాని యిక్కడ విశేషమేమిటంటే యూదులు క్రీస్తునీ నీసాను 14వ తారీఖున వధించారు. ఆ దినం యూదులకు పాస్కపండుగ. అది శుక్రవారం సాయంకాలం. సరిగ్గా దేవాలయంలో పాస్క గొర్రెపిల్లను వధించేపుడు కల్వరి కొండమీద క్రీస్తునికూడ చంపారు - యోహా 19,14. కనుక అతడు మన పాస్క గొర్రెపిల్ల. ఐగుప్న దాస్యకాలంనాటినుండి యూదులు ఏటేట వధిస్తూవచ్చిన పాస్క గొర్రెపిల్లలన్నీ ఈ క్రీస్తునే సూచిస్తూవచ్చాయి. ఈ గొర్రెపిల్లనుబట్టే ఆ గొర్రెపిల్లలన్నీ స్మరణయోగ్యమయ్యాయి.

3. క్రైస్తవుల పాస్క

1. ఆదివారపు పాస్క:

క్రీస్తులాగే మనం కూడ తండ్రివద్దకు సాగిపోవాలి. ఈలా సాగిపోయేలా చేసే సాధనాల్లో ఆదివారపు పాస్క ముఖ్యమైంది. ఇది ఆదివార పూజ. యూదులకు శనివారం విశ్రాంతి దినం. పవిత్రదినం. కాని క్రైస్తవులమైన మనకు ఆదివారం పవిత్ర దినం. ఎందుకంటే అది ప్రభువు ఉత్తానమైన రోజు. తొలిరోజుల్లోని శిష్యులు ఆదివారంపూట ఆయా గృహాల్లో సమావేశమై రొట్టె విరిచేవాళ్లు. అదే తొలినాటి పూజ - అచ 20,7. ఆదివారం ప్రభుదినం. అతని వుత్తానాన్నిస్మరించుకొనే దినం. అనగా అతన్ని ఆరాధించే దినం. ఈ యారాధనం వల్లనే మనం తండ్రిని చేరుకోగలిగేది. ఇప్పుడు మనం దేవాలయంలో ప్రభువును పూజిస్తాం. ఈ పూజలో రొట్టెను భుజించి పాత్రాన్ని పానం చేసినపుడెల్ల క్రీస్తు మరణాన్ని జ్ఞప్తికి తెచ్చుకొంటాం. అతని రెండవరాకడ కొరకు నిరీక్షిస్తాం - 1కొ 11,26. మనం పవిత్రులమయ్యే మార్గం ఇదే.

2. సాంవత్సరిక పాస్క= ఉత్తాన పండుగ :

యూదులకు మోషే నాయకత్వం క్రింద ఐగుప్మనుండి విముక్తి లభించింది. అలాగే మనకు క్రీస్తు నాయకత్వం క్రింద పిశాచ దాస్యనుండి విముక్తి లభించింది. కనుక మనం కృతజ్ఞతాభావంతో ఏటేట ప్రభువు ఉత్తానాన్ని కొనియాడతాం. పౌలు క్రీస్తు అనే మన పాస్కగొర్రెపిల్ల వధింపబడింది అన్నాడు. కనుక మన జీవితం నుండి పాపం తొలగిపోవాలి అని నుడివాడు. పులిసినపిండి పాపానికి చిహ్నమని చెప్పాం గదా! మన జీవితం నుండి ఈ పులిపిండి పోవాలి. మనం క్రొత్త పిండితో చేసిన పొంగని రొట్టెలా తయారు కావాలి అని చెప్పాడు - 1కొ 5,6-8.