పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. పొంగని రొట్టెల పండుగ :

ఇది ఆనాడు యిప్రాయేలీయుల్లో ప్రచారంలోవున్న మరో పండుగ. దీన్ని నీసాను 15-21 తేదీల్లో చేసికొనేవాళ్ళ - 12, 15-20. కాని యిది పాస్క పండుగ ముగిసిన వెంటనే రావడంవల్ల క్రమేణ ఆ పండుగతో మిళితమైపోయింది. ఈ పండుగ భావం మాత్రం ముఖ్యం. యిస్రాయేలీయులు రొట్టెలను జేసికొనే పిండిలో ముందటిరోజు పిండిని కొంచెము కలుపుతారు. ఇది రొట్టెలపిండి పులియబారేలా చేస్తుంది. రొట్టెలు పొంగేలా చేస్తుంది. కనుక ఇది పులిపిడి ద్రవ్యం. ఐనా యూదుల సంప్రదాయంలో ఈ పులిపిండి పాపానికీ మాలిన్యానికీ చిహ్నం. కనుక రొట్టెల పండుగనాడు దీన్ని వాడకూడదు. అనగా పొంగని రొట్టెలనే చేసికోవాలి. పొంగని రొట్టెలు పారిశుద్ద్యానికి చిహ్నం. ఈ రొట్టెల పండుగకూడ క్రమేణ పాస్మపండుగలో కలసిపోయిందని చెప్పాం. కనుక దానితోపాటు ఇదికూడ ఐగుప్త నిర్గమనాన్ని సూచిస్తుంది. విశేషంగా యిస్రాయేలీయులు త్వరత్వరగా ఐగుప్శనుండి బయలుదేరి రావడాన్ని గుర్తుకి తెస్తుంది – 12, 34. 8.

3.దేవాలయపు పండుగయైన పాస్క:

యూదులు పాస్మను మొదట ఐగుపులో చేసికొన్నారు. తర్వాత యెడారిలో చేసికొన్నారు. అటుతర్వాత పాలస్తీనా దేశంలో స్థిరపడిన పిమ్మట దాన్నియేటేట దేవాలయపు పండుగగా కొనియాడేవాళ్ళ - ద్వితీ 16,1-8. సున్నతి పొందిన మగవాళ్ళంతా దీనిలో పాల్గొనాలి - 12,48. క్రమేణ యూదుల పండుగలన్నిటిలోను ఇది ముఖ్యమైన ఉత్సవమయింది. దాన్ని యెరూషలేములో మాత్రమే చేసికొనేవాళ్ళ. యూదులు ఎక్కడ వసిస్తున్నా ఈ పండుగకు యెరూషలేము నగరానికి యాత్రచేసేవాళ్లు. ఈ పండుగనాటిరాత్రి మెస్సీయా విజయం చేస్తాడనే భావంగూడ రానురాను ప్రచారంలోకి వచ్చింది. కనుక ఈ పండుగ నిరీక్షణకు నిలయమయింది. పర పరిపాలనమంటే యిష్టంలేని యూదులు ఈ పండుగ సందర్భంలో రోమను ప్రభుత్వం మీద తిరగబడేవాళ్లు. గలాటా చేసేవాళ్లు -లూకా 13, 1.

2. క్రీస్తు - పాస్క

యూదులు ఆశించినట్లుగానే మెస్సీయా రానేవచ్చాడు. యూదులు తొలి పాస్కలో యావే ప్రభువు యిస్రాయేలీయుల ఇండ్లను దాటిపోయాడు. కాని యీ పాస్కలో క్రీస్తు ఈ లోకాన్ని దాటిపోయి తండ్రిని చేరతాడు - యోహా 13,1. ఆ ప్రభువు శిష్యులతో భుజించిన అంతిమ భోజనం పాస్మభోజనం. ఆ విందులో భుజింపబడిన గొర్రెపిల్ల గూడ