పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. పాస్క

"పాస్క"గ్రీకు పదం. దీనికి తుల్యమైన హీబ్రూ పదం "పేసా", హీబ్రూలో ఈ మాటకు దాటిపోవడం” అని అర్థం. ఆ నాటిరేయి ఐగుప్తలో యావే యిస్రాయేలీయుల యిండ్లను దాటిపోయాడు, ఐగుప్రీయుల ఇండ్లను శిక్షించాడు. నిర్గమ 12,13, 23.27. అతడు యిప్రాయేలీయులను దాస్యగృహమైన ఐగుపునుండి తరలించుకొని వచ్చాడు. అప్పటి నుండి యూదులకు పాస్క పవిత్ర సంఘటనం అయింది. ఇది ఓ పెద్ద బైబులు భావం, పూర్వవేదంలోనేగాక నూత్నవేదంలో కూడ ఈభావం గోచరిస్తుంది. ప్రస్తుత అధ్యాయంలో ఈ పాస్కపట్టుపూర్వోత్తరాలను వివరంగా పరిశీలిద్దాం. నిర్గమకాండం 12వ అధ్యాయం ఈ పండుగను వర్ణిస్తుంది.

1. యిప్రాయేలీయుల పాస్క

1. మొదటి పాస్క:

యిస్రాయేలీయులు అబీబు నెల 14న ఈ పండుగ చేసికొనేవాళ్లు. ఈ నెలకే నీసాను అనికూడ పేరు. మన కాలమానం ప్రకారం ఈనెల మార్చి - ఏప్రిల్ మాసాల్లో వస్తుంది. ఈ పండుగనాడు యూదులు నిర్మలమైన యేడాది గొర్రెపిల్లను బలి యిచ్చారు - నిర్గమ 12:3–6. ఆ గొర్రెపిల్ల నెత్తురును వాళ్ల ద్వారబంధాలకు పూసికొన్నారు. అలా నెత్తురు పూసిన యిండ్లను ప్రభువు శిక్షింపలేదు. కనుక ఆ రక్తం రక్షణకు చిహ్నమైంది - 12, 7.22. వాళ్లు గొర్రెపిల్ల మాంసాన్ని కాల్చి తిన్నారు. ప్రయాణం చేసేవాళ్ళలాగ గబగబ భుజించారు - 12, 8-11. అలా తినేప్పడు ఒక్కయెముకనుగూడ విరగగొట్టలేదు- 12, 46.

ఇవన్నీ పాస్క పండుగకు సంబంధించిన నియమాలు. కాని ఈ పాస్క ఐగుపు నిర్గమనంతో ప్రారంభం కాలేదు. యిస్రాయేలీయుల్లో అంతకుముందే ఈ పండుగ వాడుకలో వుంది. మోషే "మేము మూడునాళ్లు అడవిలో ప్రయాణంచేసి మా దేవుడైన యావేకు పండుగ చేసికోవాలి, కనుక మమ్మ వెళ్ళిపోనీయి" అని ఫరోను అడగబోతాడు - 3,18. ఈ పండుగ పైపాస్కే. కాని యీ పండుగ తేదీ యిక్కడ సరిగ్గా యిప్రాయేలీయులు ఐగుపునుండి వెడలివచ్చినపుడే వచ్చింది – 12,27. ఈ నిర్గమనం ఆ పండుగకు క్రొత్త భావాన్నీ ఎనలేని ప్రాముఖ్యాన్నీ చేకూర్చి పెట్టింది.