పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రజలను నడిపించే నాయకుడు క్రీస్తు. యావే ప్రభువు ఫరోకు డబ్బుచెల్లించిగాదు, అతన్ని అణగ్రద్రోక్కి యూదులకు విముక్తి కలిగించాడు అన్నాం. అలాగే క్రీస్తుకూడ పిశాచాన్ని ఓడించి మనకు పాపవిముక్తి కలిగించాడు.

4. విమోచనం దేవినుండి?

క్రీస్తు మనలను స్వతంత్రులనుగా జేసాడు అన్నాడు పౌలు - గల 5,1.ఈ స్వాతంత్ర్యమే విమోచనం. అనగా ప్రభువు మనకు పాపదాస్యాన్నుండి విమోచనం ప్రసాదించాడని భావం. పౌలు దృష్టిలో క్రీస్తు మూడు బాధలనుండి మనకు విమోచనం ప్రసాదిస్తాడు.

1. పాపం నుండి : మనం పుట్టుకతోనే పిశాచానికీ పాపానికీ దాసులంగా పుడతాం. క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందడం ద్వారా ఈ దాస్యాన్నుండి విముక్తి చెందుతాం - రోమా 6,6, కొలో 1,13-14.

2. మరణం నుండి : ఆదాము పాపం ద్వారా నరులందరికీ మరణశిక్ష ప్రాప్తించింది. చావు మనలను బాధించే ముల్లు.కాని క్రీస్తు మరణోత్దానాలద్వారా ఈ ముల్ల తొలగిపోయింది - 1 కొ 15,56. నేడుకూడ మనకు చావు తప్పదు. కాని దాని విషపరిణామం మాత్రం తప్పించుకొంటాం.

3. ధర్మశాస్త్రం నుండి : పూర్వవేద ప్రజలు ధర్మశాస్రానికి దాసుల.దాని నియమాలను పాటించలేక వాళ్లు నానా యాతనలూ అనుభవించారు. నూత్నవేదంలో ఈ ధర్మశాస్త్రం నుండికూడ క్రీస్తు మనకు విముక్తి ప్రసాదించాడు - రోమా 7,6. నేడు మనలను నడిపించేది క్రీస్తు ఆత్మేగాని ధర్మశాస్త్రంగాదు - 8,2.

ఈలా క్రీస్తుద్వారా స్వాతంత్ర్యమూ విమోచనమూ పొందిన క్రైస్తవుడు దేవునిపట్ల చనువుతో మెలుగుతాడు. ఇంటిలోని పిల్లలు తండ్రిని జూచి భయపడరు. చొరవతో అతని వద్దకు వెళ్లారు. ఆలాగే క్రైస్తవుడుకూడ తన్ను విమోచించిన క్రీస్తుద్వారా చనువుతో తండ్రివద్దకు వెళాడు - ఎఫే 3,12. హెబ్రే 4,16. ఈ చనువు భయానికి వ్యతిరేకమైనది. పూర్వవేద యూదులు యావే ప్రభువుకి భయపడేవాళ్లు, నూత్నవేద ప్రజలమైన మనం దేవునికి భయపడం. ప్రేమతో, ధైర్యంతో, చనువుతో అతని వద్దకు వెత్తాం. ఈ చొరవను మనకు ప్రసాదించేది క్రీస్తే.