పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆవలకు పంపివేసి సోదరులకు తన్నుతాను తెలియజేసికొన్నాడు. నేనే మీ తమ్ముడు యోసేపునని చెప్పాడు. ఎప్పడో గతించాడనుకొన్న సోదరులు అతన్ని చూచి దిగ్ర్భాంతిచెందారు. యోసేపు దైవలీలలను వారికి వివరించాడు. మీరు నన్ను బానిసగా అమ్మివేసినందుకు చింతించకండి. మీ ప్రాణాలను నిలబెట్టడానికి మీకు ముందుగా దేవుడే నన్నిక్కడికి పంపాడు. నన్ను ఈజిప్టుకి ప్రధానమంత్రిని చేసింది భగవంతుడే అని చెప్పాడు - 44,3-8. ఈ పలుకులను ಬಟ್ಟೆ యోసేపు గొప్పతనాన్నీ ఉదారగుణాన్నీ అర్థం చేసికోవచ్చు. ప్రాచీన కాలపు రాజులు అధికారంలోకి రాగానే పూర్వం తమకు ద్రోహం చేసినవాళ్లను పట్టి చంపివేసేవాళ్ళు. ఆలాగే యిక్కడయోసేపు కూడ అన్నలకు శిక్షించివుండవచ్చు. కాని అతడు అన్నల ద్రోహంలో దేవుని హస్తాన్ని చూచాడు. అన్నల ద్వారా దేవుడే తన్ను ఈజిప్టుకి పంపాడని యెంచాడు. దైవకటాక్షాన్ని తలంచుకొని అన్నలను పూర్తిగా క్షమించాడు. అతని దైవభక్తి విశ్వాసమూ మెచ్చుకోదగినవి కదా! - 44,5-8. సోదరులు యోసేపుకి ద్రోహంచేసినా అతడు వారికి రక్షకుడై వారిని క్షమించాడు. ఈ దృష్టితో చూస్తే అతడు క్రీస్తుప్రభువు వంటివాడు. అతడు చాలామందికి ప్రాణదాత అయ్యాడు. పానీయవాహకుని ప్రాణాలు కాపాడాడు. తన అన్నల ప్రాణాలు రక్షించాడు. ఈజిప్టు ప్రజల ప్రాణాలు నిలబెట్టాడు.

యాకోబు కుటుంబం ఈజిప్టుకి రావడం

యోసేపు తన కుటుంబాని కంతటికీ రక్షకుడయ్యాడు. అతడు తన తండ్రిని కుటుంబ సమేతంగా ఈజిప్టుకి రప్పించుకొన్నాడు. ఆ కుటుంబంవాళ్ళు మొత్తం 70 మంది. ఫరో అనుమతిపై ఈజిప్టులో సారవంతమైన గోపెను మండలంలో వారికి నివాసం కల్పించాడు. యాకోబు యోసేపు ఇద్దరు కొడుకులనూ దత్తుతీసికొన్నాడు. వారు ఎప్రాయిూము మన ష్నే అనేవారు. తర్వాత యూదులు లేవీగోత్రాన్ని లెక్కలోకి తీసికోలేదు. ఈ యిద్దరు కుమారులతో కలసి యిప్రాయేలు గోత్రాలు 12 అయ్యాయి. యోసేపు మాత్రం గోత్రకర్త కాలేదు.

యాకోబు చనిపోకముందు కొడుకులనూ మనుమలనూగూడ దీవించాడు. తండ్రి తాతల ఆశీస్సులు ఫలిస్తాయని పూర్వుల నమ్మకం. అతడు తన్ను కనానుదేశంలోనే పాతిపెట్టాలని యోసేపుచే వాగ్హానం చేయించుకొని ప్రాణాలు విడిచాడు. ఆ కుమారుడు తండ్రిని కనానులోని మక్చేలా శ్మశానంలోనే పాతిపెట్టాడు. పూర్వం అబ్రాహాము ఈసాకులను కూడ అక్కడే ఖననం చేసారు. యిప్రాయేలు ప్రజలకు కనానుదేశం పవిత్రమైంది. అది దేవుడు వారికిచ్చినభూమి. కనుక వారిని అక్కడే భూస్థాపనం చేయాలి.