పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండవ అధికారిని చేసాడు. ఈలా దైవబలం వల్ల ఒక హీబ్రూ బానిస ఈజిప్టుకి ప్రధాన మంత్రి అయ్యాడు. బిచ్చగాడు అందలమెక్కినట్లు ఐంది.

ఇక్కడ ఫరో యోసేపని సత్కరించిన తీరును జాగ్రత్తగా గమనించాలి. అతడు తన రాజాంగుళీయాన్ని యోసేపుకి ఇచ్చాడు. అది రాజు ముద్ర. కనుక సర్వాధికారాన్ని సూచిస్తుంది. అతనికి దువ్వలువలు ఇచ్చాడు. ఇవి ఆదేశంలో ప్రముఖులు ధరించేవి. యోసేపు తన బట్టను పూర్వం పోతీఫరు భార్య చేతుల్లో పోగొట్టుకొన్నాడుకదా! ఇప్పడు దానికి మించిన రాజవస్తాలు లభించాయి. ఫరోయిచ్చిన బంగారు గొలుసు కూడ ఏదో అధికారాన్నిహోదానీ సూచిస్తుంది. ఇంకా ఫరో అతన్ని తనరధానికి సాటియైన రధానెక్కించి వాడవాడల త్రిప్పించాడు. రాజభటులు ఆ రథంముందు నడుస్తూ ప్రక్కకు తొలగండని ప్రజలకు హెచ్చరికలు చేశారు. ఫరో అతనికి జఫెనత్పానెయా అని పేరుపెట్టాడు. దైవబలంతో జీవించేవాడని ఆ పేరుకి అర్థం. అతనికి హెలియోపాలిస్ నగర దేవాలయపు పూజారియైన పోతీఫెర కుమార్తెనిచ్చిపెండ్లిచేసాడు. ఈ నగరంలో సూర్యదేవత దేవాలయం ఉండేది. ఈజిప్టు ప్రధాన దేవత సూర్యుడే. ఈ పూజారికి దేశంలో గొప్ప పలుకుబడీ, రాజకీయ ప్రాబల్యమూ వుండేవి. అనగా యోసేపుకి ఆ దేశపు ప్రధానాధికారులతో బంధుత్వం కుదిరిందని భావం. పోతీఫెర అంటే సూర్యదేవత వరమని అర్థం. యోసేపు భార్యపేరు ఆస్నెతు. అనగా ఆమె నెతో అనే దేవతకు చెందిందని భావం. ప్రధానమంత్రి పదవిని పొందేనాటికి యోసేపుకి 30 ఏండ్లు. అది నిండు యౌవనం.

పెద్ద పదవుల్లోకి రాగానే చాలమందికి తలతిరుగుతుంది. ఆరోజుల్లో ఈజిప్టు ప్రపంచంలోకెల్ల అభివృద్ధి చెందిన దేశం. యోసేపుకి ఆ దేశంలో అత్యున్నత పదవి లభించింది. ఐనా అతనికి పొగరెక్కలేదు. అతడు పూర్వం కామశోధనను జయించినట్లే ఇప్పడు గర్వాన్నిగూడ జయించాడు. తాను కష్టాల ద్వారా పైకొచ్చిన వాడు. ఆ శ్రమలు అతనికి ఓర్పు, వొల్గొంచి పనిచేయడం, వినయం, కృతజ్ఞత మొదలైన సుగుణాలను నేర్చాయి. ఇంకా అతడు దైవబలంతో విజయాలు సాధించినవాడు. కనుక అతడు ఈజిప్టులో ప్రధానమంత్రి ఐన పిదపగూడ ఆ దైవబలంపైనే ఆధారపడి పనిచేసాడు. దేవునిపట్ల భయభక్తులు చూపడం విజ్ఞానానికి మొదటిమెట్టు - సామె 1,7. యోసేపులో ఈ గుణం ప్రబలంగా కన్పిస్తుంది.

అతడు దేవుని ప్రణాళికను చక్కగా అర్థంజేసికొన్నాడు. పూర్వం అన్నలు తన్ను ద్వేషించడం ఒక విధంగా మంచిదేఐంది. తాను ఈజిప్టులో బూనిసగా అమ్ముడు పోవడమూ అక్కడ చెరలో త్రోయబడ్డమూ మేలేఐంది. ఈ కష్టాలే లేకపోతే అతడు ఇప్పడు ప్రధానమంత్రి