పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీళ్లన్నా పరమప్రీతి. అందుకే ఈరచయిత దేవుడు పచ్చని చెట్లతోను నాల్గు నదులతోను కూడిన తోటను సిద్ధంచేసి ఆదాముని ఆతోటలో వుంచాడని చెప్పకొంటూపోయాడు. అనగా ఆదాముకు అన్ని సౌఖ్యాలూ అమరాయని అర్థం.

ఈతోట ఏదెనులో ఉంది. "ఏదెను" అనే హీబ్రూమాటకు మైదానమని అర్థం. ఆనందకరమైన మైదానంలో దేవుడు ఆ తోటను నాటాడు. అదికూడ తూర్పువైపుగా వుంది. అనగా రచయిత వసించే పాలస్తీనా దేశానికి తూర్పువైపుగా వుంది. తూర్పు సూర్యుడు ఉదయించే దిశ, దేవతలు మెలిగే దిశ, కనుక ఆ తోట అన్నివైభవాలతో నిండివుందని భావం,

ఆదాము వసించిన ఈ తోట సకల సౌఖ్యాలతో నిండివుండడం వల్ల మోక్షానికి చిహ్నంగా వుంటుంది. బైబులు చెప్పే ఈ తోట ఎక్కడుందో వెదకాలని చాలమంది ప్రయత్నంచేసారు. కాని ఈ తోట భౌగోళికమైంది కాదు, సాంకేతికమైంది. తొలి మానవునికి అన్ని సౌఖ్యాలూ అమరాయని చెప్పడమే ఈ తోట ఉద్దేశం. కనుక ఏదెనుతోట ఓస్థలం అనుకోవడం కంటె, ఓ దశ అనుకోవడం మేలు. తొలినరుడు సౌభాగ్యదశలో వుండేవాడని దాని భావం. అతడు దేవునికి స్నేహితుడుగా వుండేవాడు. దేవుడు అతన్ని ఆదరించి పోషిస్తుండేవాడు. అందుచేత ప్రభువు నరుణ్ణి ఏదెను తోటలో వుంచాడు అంటే అతన్ని ఉన్నతస్థాయికి కొనివచ్చాడని భావం.

2. ప్రాణమిచ్చే చెట్టు

దేవుడు నాటిన తోటలో రకరకాలైన మంచి చెట్లున్నాయి. ప్రాణ మిచ్చే చెట్టుకూడ వుంది - 2,9. ప్రాచీన జాతులన్నీ జీవవృక్ష మొకటుందనీ, దాని పండ్లు తిన్న నరులు మరణాన్ని జయిస్తారనీ భావించారు. దేవతలు ఆ చెట్టుకు కావలి కాస్తుంటారని చెప్పకొన్నారు. ఆదికాండం వ్రాసిన రచయిత కూడ ఈ వూహనే ఎన్నుకొన్నాడు. ఇక్కడ ప్రాణమిచ్చే చెట్టు అని చెప్పడంలో రచయిత ఉద్దేశం ఇది: ఆదిదంపతులకు చావులేదు. వాళ్లు స్వతస్సిద్ధంగా అమరులు. దేవునితో స్నేహంగా జీవిస్తుండేవాళ్లు,

యిప్రాయేలు ప్రజల బైబులు గ్రంథంకంటె ముందుగానే మెసపొటేమియాలో "ఎమినా ఎలీష్" అనే గ్రంథం వెలువడింది. దాన్ని క్రీస్తుకు రెండువేల యేండ్ల పూర్వమే వ్రాసారు. కనుక ఇది బైబులు కంటె కనీసం ఏడు వందల యేండ్లకు ముందే వెలువడింది. ఈ గ్రంథం 'దేవతలు నరులను చేసినపుడు చావును నరులకిచ్చివేసారు. చావలేనితనాన్నేమో వాళ్లే ఉంచేసుకున్నారు" అని చెప్తుంది. కాని బైబులు భగవంతుడేమో నరుణ్ణి చేసినప్పడు అతనికి అమృతత్వం ప్రసాదించాడు. అన్యజాతులు ఊహించిన దేవుళ్లకంటె యిప్రాయేలు ప్రజలు కొలిచిన దేవుడు ఎంత ఉదాత్తమైనవాడు!