పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్నేహితుల్లాగ మెలిగేవాళ్లు, కనుక వాళ్లిద్దరిలో హెచ్చుతగ్గులు లేవు. ఇద్దరూ సరిసమానులే. వైవాహిక ప్రేమద్వారా వాళ్లిద్దరూ ఒకరినొకరు బలంగా ఆకర్షించుకొంటారు. ఒకరినొకరు పరిపూరులను జేసికొంటారు. ఈ ప్రక్కటెముక ఉదంతంలో భగవంతుడు ఓ శస్త్రచికిత్సాకారుడుగా పనిచేసాడు అన్నభావం స్ఫురిస్తుంది.

3. ఎముకల్లో యెముక

ప్రభువు ఏవనుచేసి ఆదామునొద్దకు తోడ్మొనిరాగా అతడు ఆస్త్రీని చూచి 'ఈమె నాయెముకల్లో ఎముక, నాదేహంలో దేహం" అనుకొన్నాడు – 2, 23. ఇక్కడ ఎముకల్లో ఎముక, దేహంలో దేహం అంటే దగ్గరి చుట్టం అనిఅర్థం. అనగా ఏవ ఆదామువంటిది. అతనికి ఆపరాలు, ప్రియురాలు. హీబ్రూ భాషలో పురుషునికి "ఈష్" అని స్త్రీకి "ఈషా" అని పేర్లు. ఈష్ నుండి పట్టింది గనుక ఆమె ఈషా అయింది అన్నాడు మూలంలో హీబ్రూ రచయిత. దీన్నే మనభాషలో చెప్పాలి అంటె ఏవ “నరుని" నుండి పుట్టింది గనుక "నారి"అయింది.

ఆదాము ఏవకు నారి అని పేరుపెట్టాడు. హీబ్రూ సంప్రదాయం ప్రకారం పేరు పెట్టడమంటే అధికారం నెరపడం. కనుక నరుడు స్త్రీ మీద పెత్తనం చేస్తుంటాడు. ఆమె అతని అధికారంలో వుంటుంది. ఐనా స్త్రీ పురుషునికంటే తక్కువది కాదు. ఆమె అతన్నీ అతడు ఆమెనూ పరస్పరం పరిపూర్ణం చేసికొంటూంటారు.

దేవుడు ఏవను చేయకముందు ‘నరుడు ఒంటరిగావుండడం మంచిదికాదు. అతనికి తోడునీడగా వుండడానికి ఓ స్త్రీని సృజిద్దాం" అనుకొన్నాడు –2, 18. కనుక యావే స్త్రీనిచేయటంలో ఉద్దేశం ఆమె నరునికి అండదండగా వుండాలనే. అనగా భార్య భర్తకు స్నేహితురాలుగాని బానిసకాదు. పూర్వం సోక్రటీసు తాను స్త్రీయై పుట్టనందుకు దేవతలకు వందనా లర్పించాడు. ప్లేటో పాపం చేసిన నరులు మొదట స్త్రీలుగాను ఆ పిమ్మట జంతువులుగాను పునర్జన్మ మెత్తుతారు అన్నాడు. ఈలాగే చాలామంది జ్ఞానులు స్త్రీలను హేయంగా చూచారు. ఇంకా కొంతమంది స్త్రీలను స్వార్గానికి వాడుకొన్నారు. స్త్రీని ఓ భోగ్యవస్తువునుగా పరిగణించి ఆమెతో లైంగికసుఖాలు అనుభవించడమే పరమధ్యేయం అనుకొన్నారు. లింగాన్ని ఓ దేవతగా భావించి కొలిచారు, బైబులు ఈ విపరీత ధోరణులకు సమ్మతింపదు. స్త్రీ పురుషులు సమానమేననీ, వారిరువురూ పరస్పర సహాయకులనీ బోధిస్తుంది. వాళ్లిద్దరూ దేవుని బిడ్డలేననీ చెప్తుంది. నేడు మనం కూడ స్త్రీపురుష వైవిధ్యాన్ని చూచి విస్తుపోతాం. ఆడు మగ విభేదం ఎంత విచిత్రమైందాఅని ఆశ్చర్యపోతాం. స్త్రీపురుషులంగా జీవించే మనకు ఈలా ఆశ్చర్యపడ్డం చాలా అవసరం కూడ.