పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తానుమల్లా మట్టిఐపోతాడు. ఏ మట్టినుండి పుట్టాడో ఆమట్టిలోనే కలసిపోతాడు. ఇది నరుని దౌర్భాగ్యం.

7. ప్రాణవాయువు

దేవుడు నరుని ముక్కు గోళ్లల్లోనికి ప్రాణవాయువు నూదగా అతడు జీవంపొందాడు - 2,7. అన్ని ప్రాణులూ వాయువు వల్లనే బ్రతుకుతుంటాయి. నరుడు కూడ వాయువు వల్ల జీవం పొందాడు, బ్రతికాడు. ఇక ఆ వాయువు. నూదినవాడు దేవుడు కనుక పై "నేలమట్టి" లాగా ఈ "ప్రాణవాయువు" అన్న ప్రయోగం గూడ నరుడు దేవునిమీదనే పూర్తిగా ఆధారపడి ఉండేవాడని సూచిస్తుంది. రచయిత జంతువుల సృష్టినిగూర్చి చెప్పినపుడు ఒట్టినే దేవుడు వాటిని సృజించాడని చెప్పాడు - 2, 19. కాని నరుని సృష్టినిగూర్చి చెప్పేప్పడు మాత్రం దేవుడు ఎంతోకృషి చేసినట్లుగా చెప్పకవెళ్లాడు - 2,7. జంతువుల్లో పెద్ద ఆధిక్య మేమీలేదు. అవన్నీ నరుని కోసమే. కాని అతడు చాలవిశిష్ణుడు. కనుకనే అతడు వాటికి పేర్లు పెడతాడు - 2, 20. ఇక్కడ జంతువులకు పేర్లు పెట్టడమంటే వాటిమీద అధికారం నెరపడం. కాని ఈ జంతువుల్లో నరునికి తోడుగా వుండదగిన ప్రాణి ఏదీ లేకపోయింది. అవి అతనిలాంటివికావు. కనుకనే ప్రభువు ఆదాము లాంటి వ్యక్తిని మరొకర్తెను చేయవలసి వచ్చింది.

3. నారి

1. నిద్ర

ప్రభువు ఆదాముకి గాఢనిద్ర కలిగించి అతని ప్రక్కటెముకను తీసి స్త్రీని చేసాడు - 2, 21. కాని ఇక్కడ దేవుడు ఆదాముకి గాఢనిద్ర పుట్టించడం దేనికి? అతనికి భాధ కలుగకుండావుండేలా మైకం కలిగించడానికా? కాదు. భగవంతుణ్ణిగాని, అతని సృష్టి రహస్యాలుగాని నరుడు చూడలేడు. ఇక్కడ ప్రభువు ఏవనుచేయబోతున్నాడు. ఆసృష్టి కార్యాన్ని ఆదాము చూడకూడదు. చూడలేడు కూడ. అందుకే ప్రభువు అతన్ని నిద్రబుచ్చాడు. "భగవంతుణ్ణి చూచి ఏ నరుడూ బ్రతక లేడు” అంటుంది నిర్గమకాడం 33,20.

2. ప్రక్కటెముక

దేవుడు ఆదాము ప్రక్కటెముక నుండి స్త్రీನಿ చేసాడు. ఇక్కడ ప్రక్కటెముక అంటే యేమిటి? యావే స్త్రీని పురుషుని ప్రక్కటెముక నుండి చేసాడు అంటే ఆమెకూడ ఆపురుషునిలాంటిదేనని భావం. మగవాడూ ఆడదీ ఒకే స్వభావం కలవాళ్లు, రెండు రూపాల్లో వున్నా వాళ్లిద్దరూ నరులే. కనుక వాళ్లిద్దరూ యజమానుడూ బానిసా కారు. వాళ్ల తండ్రీ సృష్టికర్తా ఐన దేవునిముందు ఆ యిద్దరూ సమానమైన హోదా కలవాళ్లు,