పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5. భూమిని వశం చేసికోవడం

దేవుడు ఆది దంపతులతో “మీరు భూమిని వశం చేసికొనండి" అన్నాడు - 128. నరుడు నేలను దున్నిసాగుచేస్తుంటాడు. ఈ కృషివల్ల భూమి అతనికి వశమౌతుంది, పంటలు పండిస్తుంది, అతన్ని పోషిస్తుంది. కనుక కృషి ఎంతో విలువైంది. పని నీచమైంది కాదుగదా గౌరవ ప్రదమైంది. నరుడు కష్టపడి పని చేయాలి. ఇక, కష్టపడే నరులంతా భూమి పండించే పంటలను అనుభవించాలి. కొందరు మాత్రమే మేము భూస్వాముల మన్న నెపంతో ఆ పంటంతా దోచుకొని అధిక ధనవంతులు కాగూడదు. మరి కొందరు ఆ భూమి మీద కృషి చేసికూడ, కూలివాళ్లు కనుక, దాని పంట ననుభవింపలేక నానాటికీ నిరుపేదలై పోగూడదు. ఇది సాంఘిక అన్యాయం. భగవంతుడు భూమిని అందరి కొరకు కలిగించాడు. మనం మాత్రం అన్యాయంగా భూమిని మన అదుపులోనికి తెచ్చుకొంటూంటాం, ఇతరులకు దాన్ని దక్కనీకుండా చేస్తుంటాం.

6. నేల మట్టినుండి

దేవుడు నేల మట్టినుండి నరుణ్ణి చేసాడు - 2,7. భగవంతుడు నరుద్ధి చేసాడని మనకు తెలుసు. కాని ఏలా చేసాడో మనకు తెలీదు. ఇక, మనుష్యులకు మనుష్య భాషలో చెపైనే గాని అర్థంకాదు. కనుక ఇక్కడ రచయిత మనుష్యుడు చేసే ఓ పనిని పోలికగా తీసికొని భగవంతుడు నరుడ్డి ఈలా సృజించాడు అని ఉపమాన పూర్వకంగా చెప్తున్నాడు. కుమ్మరి మట్టితో కుండను చేస్తాడు. కుండ తన పుట్టుకకు పూర్తిగా కుమ్మరి మీదనే ఆధారపడి వుంటుంది. ఈలాగే మానవుడు కూడ తన పుట్టుకకు పూర్తిగా భగవంతుని మీదనే ఆధారపడ్డాడు. ఐగుప్తీరీయులు, సుమేరియనులు, బాబిలోనీయులు భగవంతుడు నరుడ్డి సృజించడాన్ని కుమ్మరి పనితో పోల్చారు. యిర్మీయా ప్రవక్త కూడ ఈ యుపమానాన్ని వాడాడు - 18,6. ఆదికాండం వ్రాసిన రచయిత కూడ ఈ యుపమానాన్నే ఎన్నుకొన్నాడు.

కనుక ఇక్కడ భగవంతుడు నేల మట్టినుండి నరుణ్ణి చేసాడు అంటే నరుడు పూర్తిగా భగవంతుని మీదనే ఆధారపడి వుండేవాడని భావం. దేవుడు ఎంతో ప్రేమా కనికరమూ కలవాడు కనుక మట్టినుండి నరుద్ధి చేసాడు. దేవుడు చేయకుముందు అతడు లేడు. అన్నిప్రాణుల్లాగే అతడు నిత్యం ఆప్రభువు మీదనే ఆధారపడాలి. తాను సృజించిన నరుడు బలహీనపు ప్రాణి కనుక ప్రభువు అతన్ని ఎంతో ఆదరంతో చూస్తుంటాడు. కంటిపాపను లాగ కాపాడుతుంటాడు. కాని మట్టిమానిసి యైన నరుడు దుషుడు, పొగరుబోతు. అతడు భగవంతుని సృష్టికార్యాన్ని ఒక్కనిమిషంలో భగ్నంచేసి శాపంపొంది