పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాక్కుతో నరుడ్డి కలిగిస్తాడు. ఆరవరోజున కాని నరుని సృష్టిజరుగలేదు. ఇక్కడ దేవుడు ప్రాణవాయువు నూది నరుణ్ణి చేస్తాడు. మొదటి రోజుననే అతన్ని సృజిస్తాడు. అక్కడ దేవుడు నరునికి కొంచెం దూరంగా వున్నటూ అతన్ని గూర్చి అట్టే పట్టించుకోనటల్లా కనిపిస్తాడు. కాని ఇక్కడ నరునికి చాలా సన్నిహితంగా వున్నటూ అతనిపట్ల ఆదరాభిమానాలు చూపినటూ కన్పిస్తాడు. యావే సంప్రదాయంలో కుమ్మరి మట్టితో నరుడ్డి చేసాడు అనేభావం స్పురిస్తుంది. 4. అక్కడ నరుడంటే దేవుని పోలికా ఆకారమూను. ఇక్కడ నరుడంటే మట్టీ వాయువును. 5. అక్కడ నరుని బాధ్యత, సంతానాన్ని కని వృద్ధిలోనికి రావడమని చెప్పబడింది. అతడు భూమి మీద దేవుని ప్రతినిధిగా వుంటాడు. దేవుని తరపున సృష్టి వసువులన్నిటినీ పరిపాలిసుంటాడు. ఇక్కడ నరుని బాధ్యత, దేవుని ఆజ్ఞలనుపాటించడమని చెప్పబడింది. అతడు దేవుడు తినవద్దన్న పండును తినరాదు. పైగా నరుడు దేవుడు నాటిన తోటను సాగుచేస్తుండాలి. 6. యాజక సంప్రదాయం మాత్రమే దేవుడు ఆది దంపతులను దీవించాడనీ వాళ్లు బిడ్డలను కని వృద్ధిలోనికి రావాలని కోరుకొన్నాడనీ చెప్తుంది. యావేసంప్రదాయం మాత్రమే నరుడు జంతువుల కన్నిటికీ పేళ్లు పెట్టాడనీ స్త్రీనిచూచి సంతోషించాడనీ చెప్తుంది. ఆలాగే యావే సంద్రాయం మాత్రమే ఏదెను తోటలో ప్రాణమిచ్చే చెటూ మంచి చెడ్డలను తెలియజేసేచెటూ వున్నాయనీ, నరుడు ఆరెండవ చెట్టుపండ్లు ముట్టుకోగూడదని దేవుడు ఆజ్ఞయిచ్చాడనీ చెప్పంది. ఇవి ఈరెండు సంప్రదాయాల్లో కనిపించే కొన్ని వ్యత్యాసాలు. ఈ వ్యత్యాసాలన్నిటినీ గమనిస్తేనేగాని ఆదికాండం వర్ణించే విశ్వసృష్టి చక్కగా బోధపడదు.

5. సృష్టి అంటే యేమిటి?

ఇక ఈవ్యత్యాసాలు ఏలావున్నా భగవంతుడు సృష్టి చేసాడు అనేసంగతిమాత్రం చాలగొప్పది. మనం సృష్టి చేయలేం. మనం చేసేదల్లా ఓ వస్తువును మరోవస్తువుగా మార్చడమే. కుమ్మరి మట్టితో కుండను చేస్తే అది సృష్టికాదు, వస్తువు మార్పు ఔతుంది. కాని భగంతుడు ఓ వస్తువునుండి మరోవస్తువునుగాదు, శూన్యం నుండి వస్తువులను కలిగించాడు. అదే సృష్టి, ఇది మనకు మించిన పని. కనుకనే సృష్టి మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ ప్రభువు కూడ తానుచేసిన సృష్టినిచూచి ఎంతోసంతోషించాడు. ఆయన కంటికి అది బాగా వుంది - 1,31. మొదటి అధ్యాయంలోనే ఈ “బాగావుంది” అనే వాక్యం ఐదుసార్లు విన్పిస్తుంది. కనుక దేవుడు చేసిన ఈప్రపంచం చాలగొప్పది, చాలమంచిదికూడ. ఈలోకంలో జన్మించడం, ఈలోకాన్ని చేసిన దేవుణ్ణి స్మరించుకోగల్గడం, మన భాగ్యవిశేషం అనాలి.