పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మత్తయి

మత్తయి గ్రీకు సువిశేషం 65 ప్రాంతంలో వెలువడింది. దీనికి పూర్వం 12 మంది శిష్యుల్లో ఒకడైన మత్తయి వ్రాసిన అరమాయిక్ సువిశేషం వుంది. దీన్ని మార్కు సువిశేషాన్నీ ఆధారంగా తీసికొని మరొక రచయిత ఈ గ్రీకు సువిశేషాన్ని వ్రాసాడు. శిష్యుడైన మత్తయి స్వయంగా వ్రాసిన అరమాయిక్ సువిశేషం ఇప్పడు లభ్యంకాదు. నాల్గు సువిశేషాల్లోను ఎక్కువ ప్రసిద్ధిలోకి వచ్చింది ఈ మత్తయి సువిశేషమే. దీనిలోని ప్రధానాంశం దైవరాజ్యం. యూదులకు ఆదిపంచకం ఏలాగో క్రైస్తవులకు ఈ సువిశేషం ఆలాగు. దానిలాగే ఇదికూడ ఐదు భాగాలుగా వుంటుంది. క్రీస్తు నూత్న మోషే. పూర్వవేద ప్రవచనాలన్నీ అతనియందు నెరవేరాయి. అతడు తన మరణోత్తానాల ద్వారా మనలను నూత్న వాగ్రత్తభూమియైన మోక్షానికి కొనిపోతాడు. రచయిత ఈ గ్రంథాన్ని యెరూషలేములోని క్రైస్తవుల కోసం వ్రాసాడు.

లూకా

లూకా 70లో ఈ సువిశేషాన్ని వ్రాసాడు. ఇతడు పౌలు శిష్యుడు. మార్కుమత్తయి సువిశేషాలు యూదుల కోసం ఉద్దేశింపబడ్డాయి. కాని ఈ గ్రంథం ప్రధానంగా గ్రీకు క్రైస్తవుల కోసం ఉద్దేశింపబడింది. క్రీస్తు కరుణ, పవిత్రాత్మ ప్రార్ధన మొదలైన అంశాలను ఈ సువిశేషం ప్రత్యేక శ్రద్ధతో వర్ణిస్తుంది. రచనావిధానంలో ఈ మూడవ సువిశేషం తొలి రెండింటికంటె సుందరంగా వుంటుంది.

యోహాను

ఇది అన్నిటికంటె చివరన వచ్చిన సువిశేషం. మొదటి శతాబ్దంలో పుట్టింది. છોડિ తొలి మూడిటిలాగ క్రీస్తు సమగ్ర చరిత్రను చెప్పదు. క్రీస్తు జీవితంలోని కొన్ని ముఖ్యమైన సంఘటనలను మాత్రం ఎన్నుకొని వాటిమీద వ్యాఖ్య చెప్పంది. తండ్రిని తెలియజేసే దైవవార్త క్రీస్తు, అతడు లోకానికి వెలుగు, జీవం, సత్యం. అతడు మనకు దైవప్రేమనూ సోదరప్రేమనూ నేర్పేవాడు. ఇవి యీ గ్రంథంలోని కొన్ని ముఖ్యాంశాలు.

2. అపోస్తలుల కార్యాలు

ఇది లూకా రెండవ రచన. శ్రీసభ తొలి ముప్పది యేండ్ల చరిత్రను చెప్తుంది. విశేషంగా పేత్రు పౌలు వేదబోధలను వర్ణిస్తుంది. దీనికి పరిశుద్దాత్మ సువిశేషమని కూడ పేరు. క్రీస్తు ఉత్తానానంతరం ఆత్మ తొలి క్రైస్తవ సమాజాలను నడిపించిన తీరును ఈ గ్రంథం విపులంగా వర్ణిస్తుంది.