పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యెషయా చెప్పినట్లే అస్సిరియా రాజైన సనైరీబు 701లో యెరూషలేమును ముట్టడించి కూడ ఓడిపోయాడు. యావే ప్రభువు ఆ పట్టణాన్ని కాపాడాడు. యెషయా మహాభక్తుడు, మహాకవి. అతని యంత గొప్ప ప్రవక్త మళ్ళా పుట్టలేదు. అతని గ్రంథంలో వచ్చే ఇమ్మానువేలు ప్రవచనాలు చాలా ముఖ్యమైనవి. ఇవి రాబోయే మెస్సియాను సూచిస్తాయి. ఈ ప్రవక్త భగవంతుని పావిత్ర్యాన్నీ నరుని అపవిత్రతనీ బహు సునిశితంగా వర్ణించాడు.

ఈ గ్రంథంలో వచ్చే 40-55 అధ్యాయాలు మరో ప్రవక్తవి. బాబిలోనియా ప్రవాసంలో జీవించిన యెషయా శిష్యుడెవడో ఈ ప్రవచనాలు చెప్పాడు. ఇతడు ప్రజలు బాబిలోనియా ప్రవాసాన్ని ముగించుకొని తిరిగిరావడం, పూర్వం యిస్రాయేలీయులు ఐగుప్త ప్రవాసాన్ని ముగించుకొని తిరిగి వచ్చినట్లుగా వుంటుందని చెప్పాడు. కనుక పునరాగమనం ఈ రెండవ భాగంలో ముఖ్యాంశం. ఈ ప్రవచనం 58వ అధ్యాయంలో సుప్రసిద్ధమైన బాధామయ సేవకుని వర్ణనం వస్తుంది. ఈ సేవకుడు రాబోయే క్రీస్తే, ఈ రెండవ భాగాన్ని చెప్పిన ప్రవక్త కూడ మొదటి యెషయా అంతటి రచయిత.

కడపటి 55-66 అధ్యాయాలు బాబిలోనియా ప్రవాసం ముగిసి ప్రజలు యెరూషలేముకు తిరిగివచ్చాక ఇతర ప్రవక్తలు చెప్పినవి. వీళ్ళంతా తొలి యెషయా శిష్యులే. ఈ మూడవభాగంలో ప్రభువు యూదులనే కాక అన్యజాతులను గూడ రక్షిస్తాడనే విశాలభావాలు కన్పిస్తాయి.

యిర్మీయా

ఈ ప్రవక్త 640-590 కాలంలో జీవించాడు. అస్సిరియా రాజ్యం పతనమై బాబిలోనియా రాజ్యం వృద్ధిలోకి వచ్చింది. 587లో బాబిలోనియా ప్రభువైన నెబుకద్నె సరు యెరూషలేమును ముట్టడించి నాశం చేసాడు. దేవాలయాన్ని ధ్వంసం చేసాడు. యూదులను బాబిలోనియాకు బందీలనుగా గొనిపోయాడు. ఈ వినాశాన్ని ముందుగనే తెలియజేసి యూదులను పరివర్తనం చెందండని హెచ్చరించడమే యిర్మియా ప్రవచనం. కాని యూదులు అతని ప్రబోధాన్ని వినలేదు. మొదటి నుండీ అతన్ని ఎదిరించి హింసిస్తూవచ్చారు. యిర్మీయా తన ప్రజల నుండి చాల బాధలు అనుభవించాడు. జనులు తన మాట వినరనీ, తనకు అపజయం తప్పదనీ తెలిసికూడ ప్రభువు వలన నిర్బంధితుడై ప్రవచనం చెపూపోయాడు. అతని బాధలు నూత్నవేదంలో క్రీస్తు బాధలను సూచిస్తాయి. ఈ ప్రవక్త మహాభక్తుడు. ఇతడు తన ప్రవచనం 81వ అధ్యాయంలో నూత్ననిబంధాన్ని పేర్కొన్నాడు. ఇదే క్రీస్తు నెలకొల్పిన నూత్న వేద నిబంధనం. ఈ ప్రవచనం ఇతని గ్రంథంలో శిఖరంలాంటిది. దైవభక్తి బాహ్యాచారాల్లోగాక అంతరంగంలో వుంటుందనేది ఇతని ప్రధాన