పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కనాను మండలాన్ని జయించి యిస్రాయేలు తెగలకు పంచియిచ్చాడు. యోషువా పేరే నూత్న వేదంలో యేసు పేరుకూడ. అతడు యూదులకు పంచియిచ్చిన వాగ్దత్తభూమి నూత్నవేదంలో మోక్షాన్ని సూచిస్తుంది.

న్యాయాధిపతులు

ఈ గ్రంథం వాగ్రత్తభూమిని జయించినప్పటినుండి 1050 వరకు నడచిన చరిత్రను చెప్తుంది. ఇంకా రాజులు లేని ఆ ప్రాచీనకాలంలో దెబోరా, యెహూదు, గిద్యోను, యెఫా సంసోను మొదలైన న్యాయాధిపతులు ప్రజలను పరిపాలించారు. వాళ్ళ చరిత్రలన్నీ ఈ గ్రంథంలో వస్తాయి.

రూతు

రూతు అన్యజాతియైన మోవాబీయుల ఆడపడుచు. బోవసు అనే సంపన్నుడైన యూదుడ్డిపెండ్లియాడి దావీదు రాజునకు ముత్తవ్వ అయింది. ఎజ్రా మొదలైన సంస్కర్తలు అన్యజాతి ప్రజలను యూదుల్లో చేర్చుకోరాదని శాసించారు. రూతుగ్రంథం ఈ సంకుచిత భావాలమీద తిరుగుబాటు చేస్తుంది. ఇది పాఠకులకు ఎంతో ఆసక్తిని పుట్టించే గ్రంథం

సమూవేలు గ్రంథాలు రెండు,

రాజల గ్రంథాలు రెండు

ఈ నాలు గ్రంథాలు 1050 నుండి 550 వరకు నడచిన యిస్రాయేలు చరిత్రను, విశేషంగా రాజుల ఉదంతాలను వర్ణిస్తాయి. ప్రవక్తయైన సమూవేలు సౌలును మొదటి రాజుగా అభిషేకించాడు. అతడు భ్రష్టుడైపోగా దావీదును రెండవరాజుగా అభిషేకించాడు. ఇతడు యిస్రాయేలు తెగలను ఐక్యపరచాడు. మందసాన్ని యెరూషలేముకు తీసికొనివచ్చాడు. దావీదు కుమారుడైన సాలోమోను యెరూషలేములో దేవళాన్ని కట్టించాడు. ఈ రాజు పాపాలవలన ఇతని యనంతరం దేశం యూదా, యిప్రాయేలు అని రెండుభాగాలుగా చీలిపోయింది. 6వ శతాబ్దంలో ఆనాటి ప్రపంచరాజ్యాలయిన అస్పిరియా బాబిలోనియా సామ్రాజ్యాలు యూదుల దేశాలను రెండింటినీ నాశంచేసాయి. వందలాది రాజులు పరిపాలించినా ఈ గ్రంథాలు వారిలో దావీదు, హిజ్కియా, యోషియా అనే ముగ్గురు రాజులను మాత్రమే మెచ్చుకొంటాయి.

దినవృత్తాంతాలు రెండు

_ ఈ గ్రంథాలుకూడ రాజుల చరిత్రలనే చెస్తాయి. వీటిని లేవీయ కాండను వ్రాసిన యాజకులు రచించారు. ఈ రచయితలకు దైవభక్తి ప్రధానం. ఈ దృష్టితోనే వీళ్ళు రాజుల 24