పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబజీవితం జీవించేవాళు కుటుంబమంతటితో సమావేశమై, ఒకరు చదువుతూండగా అందరు వాక్యాన్ని ఆలించి, ఆ పిమ్మట సమష్టిగా అందరూ ప్రార్ధనం జేసికోవడం మంచిది. రోజురోజు కుదరకపోయినా అప్పడప్పడు ఈ సమష్టి పఠనం జరుపుకోవడం ఉత్తమం. వ్యక్తిగతంగా గాని కుటుంబవారిగాగాని ఎవరి బైబులు వాళ్ళకు వండాలి.

4 ఆలోచనం :

బైబులు భాగాన్ని చదివి ముగించాక ఆ చదువుకున్న వాక్యాలను గురించి కొంతకాలం ఆలోచించి చూచుకోవాలి. ఆ విన్న సంఘటనను ఓ దృశ్యంలాగ మనోనేత్రాలముందు చిత్రించుకోవాలి. ఈ వాక్యాల్లో ఎవరు మాటలాడుతున్నారు? ఎక్కడ యెవరితో యేమి మాటలాడుతున్నారు? ఏమి చేస్తున్నారు? ఎందుకు అలా చేస్తున్నారు? ఈలాంటి ప్రశ్నలు బైబులు భాగాలను ఆలోచించి చూచుకొని అర్థం చేసికోవడానికి ఉపయోగపడతాయి,

5. ప్రార్ధనం

ఆ పిమ్మట మనం చదువుకున్న భాగాన్ని తలంచుకొని ప్రార్ధనం చేసికోవాలి. ఆయా బైబులు భాగాల సందర్భాన్నిబట్టి మన ప్రార్ధనం బహుముఖాలుగా వుండవచ్చు. మనమూ తూరుపదేశపు జ్ఞానుల్లాగ ప్రభువును ఆరాధింపవచ్చు. స్వస్తుడైన కుష్టరోగిలాగ ప్రభువునకు కృతజ్ఞత తెలుపవచ్చు. శిష్యుల్లాగ "ప్రభూ, మాకు ప్రార్థించే విధానం నేర్చండి" అని వేడుకోవచ్చు కననీయ స్త్రీలాగ "ప్రభూ, నా బిడ్డ దయ్యం సోకి బాధపడుతూంది" అని మనవి చేయవచ్చు కీర్తనకారునిలాగ "ప్రభూ, నా అతిక్రమాలు నాకు తెలిసేవన్నాయి. నా పాపాలు ఎల్లపుడు నా యెదుటనే నిలచి వున్నాయి" అని పశ్చాత్తాపపడవచ్చు. లెక్సియొ దివీనా విధానంలో ఈ ప్రార్ధనాంశం పరమ ప్రధానమైంది.

మనం ఒక్క వాక్యాన్ని మాత్రమే చదువుకొని 15 నిమిషాలు ప్రార్థన చేసికోవచ్చు లేదా ఒక సందర్భాన్ని వర్ణించే వాక్యాలు కొన్ని చదువుకొని ప్రార్ధన చేసికోవచ్చు. ఇక్కడ ప్రార్ధనంకోసం బైబులు చదువుతూన్నాంగాని విజ్ఞానంకోసం గాదు. అంచేత యీ లెక్సియొ దివీన విధానంలో ఎన్ని వాక్యాలు చదివాం అన్నది ప్రధానం గాదు. మరి యెంత చక్కగా ప్రార్ధన చేసికున్నాం అన్నది ప్రధానం. ఇక, ఉదయం మనం చదువుకున్న వాక్యాన్ని హృదయంలో నిలుపుకొని రోజంతా అప్పడప్పడు ధ్యానించుకుంటూ వుండాలి. మరియమాత యిూలా చేసేదని వింటున్నాం (లూకా 2:19).