పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రార్థించుకున్నట్లయితే ఆ దినమంతా ప్రభువుకి అంకితమరొతుంది, ధన్యమౌతుంది. ఈ యుదయకాల బైబులు ప్రార్ధనం వేయి ఏనుగుల బలాన్ని ఇస్తుంది. ఐనా, ఎవరైనా కారణాంతరాలచే మరొక కాలం బైబులు పఠనానికి వినియోగించుకుంటామంటే అభ్యంతరమేమీ లేదు.

2. భగవత్సాన్నిధ్యం :

బైబులు వరనానికి ముందు భగవత్సాన్నిధ్యం కలిగించుకోవాలి. సర్యాంతర్యామియైన ప్రభువు మన యీ పఠనాన్నిగూడ గమనిస్తాడు. కనుక మనం భక్తిప్రపత్తులతో యీ గ్రంధాన్ని చదువాలి. వినయవిధేయతలతో ప్రభువాక్యాన్ని ఆలించాలి. "ప్రభూ! నీ సేవకుడు ఆలిస్తూనే వున్నాడు, సెలవీయి అన్నాడు బాలుడైన సమూవేలు. (1, సమూ 3:10). “ప్రభూ! నా కన్నులు తెరువు, నేను నీ ధర్మశాస్త్రం బోధించే ఆశ్చర్యకరమైన సంగతులను గుర్తిస్తాను" అన్నాడు కీర్తనకారుడు (119:18). ఈలాంటి వాక్యాలను వేనినైనా భగవత్సాన్నిధ్యం కలిగించుకోవచ్చు.

ఆ పిమ్మట పరిశుద్దాత్మను ప్రార్థించాలి. భక్తులను ప్రబోధించి దివ్యగ్రంథాలను "వ్రాయించింది యాత్మ పునీతులను ప్రబోధించి దివ్యగ్రంథ బోధనల ప్రకారం వాళ్ళు తమ జీవితాలను తీర్చిదిద్దుకునేలా చేసిందీ యీ యాత్మమే. నేడు మనలను ప్రభుమార్గాల్లో నడిపించేది, మనకు “సర్వసత్యం" బోధించేది యీ యాత్మమే (యోహా, 14:26), కావున మనంగూడ మనం చదువుకునే యీ దివ్యగ్రంథాన్ని అర్థంజేసికోవాలనీ, అర్థంజేసికున్న అంశాన్ని జీవితంలో ఆచరణలో పెట్టాలనీ యీ యాత్మను అడుక్కోవాలి. ఈ క్రింది ప్రార్థనలాంటి ప్రార్థనను ఓదాన్ని వాడుకోవచ్చు. క్ర్తెస్తవ ప్రజలను నడిపించే దివ్యాత్మమా! నీవు వ్రాయించిన ఈ దివ్యగ్రంథాన్ని నీవే ఉపాధ్యాయుడవై నాకు బోధించు. నా బుద్ధిశక్తిని ప్రబోధించు. నేను చదువుకునే యిూ బైబులు గ్రంథాన్ని అర్థంజేసికునేలా చేయి. నా హృదయాన్ని మేలుకొల్పు. నేను అర్థంజేసికున్న సత్యాలను ఆచరణలో పెట్టేలా చేయి. నేను తెలుసుకున్న క్రీస్తును ప్రేమించి సేవించేలా అనుగ్రహించు ఆమెన్

3. పఠనం :

ఆ పిమ్మట బైబుల్లోని ఓ భాగాన్ని చదువుకోవాలి. ఈ భాగం కొన్ని వాక్యాలు కావచ్చు, లేక ఓ యధ్యాయం కావచ్చు. కాని యిూ భాగాన్ని ముందుగనే నిర్ణయించుకొని వండాలి. బైబులు గ్రంథంలోని అన్ని పుస్తకాలు, అన్ని పుటలు తప్పనిసరిగా అర్థమౌతాయి, ప్రార్థనకు ఉపయోగపడతాయి అన్న నియమం యేమీలేదు. అంచేత కాలవ్యయం కలకుండా వుండాలంటే మన అవసరానికి ఉపయోగపడే వాక్యాలను ముందుగనే నిర్ణయించుకొని వండాలి