పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

9. విశ్వాసం :

బైబులును విశ్వాసంతో చదవాలి. క్రీస్తేమో ఆనాడూ యిూనాడూ యేనాడూ రక్షకుడే. కాని మనలో చాలినంత విశ్వాసం వుండదు. అంచేత అతడు మనపట్ల రక్షకుల్లా వ్యవహరించడు. ఆనాడు చాలమంది క్రీస్తులో మానవట్టేగాని దేవుణ్ణి చూడలేకపోయారు. చాలమంది దివ్య సత్రసాదంలో రొట్టెముక్కనేగాని ప్రభుసాన్నిధ్యాన్ని గుర్తింపలేరు. ఇంకా చాలమంది తిరుసభలో ఓ మానవ సమాజాన్నేగాని క్రీస్తు సాక్షాత్కారాన్ని గుర్తించలేరు. ఈలాగే బైబుల్లోగూడ చాలమంది ఓ పుస్తకాన్నే గాని భగవంతుని వనికిని గుర్తింపలేరు. చాలా పుస్తకాల్లో యిదీ వొకటి అనే దృష్టితో చదివేవాళ్ళకు బైబులు సత్ఫలితాన్నియిూయదు.

10. ఒరపిడి రాయి :

బైబులును మనం భక్తితో చదువుతున్నామా అనే ప్రశ్నకు సమాధానం ఒక్కటే వొక్కటి. ఆ గ్రంథంలో మనం ప్రభువును కలసికోవాలి. ఆ ప్రభువాక్యం మనకు ఓ అనుభూతిని కలిగించాలి. ఈ యనుభూతిని కలిగించుకున్నవాడే బైబులు పఠిత తన గొట్టెలేవో ప్రభువుకు తెలుసు, వాటికీ ప్రభుస్వరం తెలుసు (యోహా. 10:3–5). బైబుల్లోని ప్రభుస్వరాన్ని గుర్తించిననాడుగాని మనం బైబులు చదివినట్లుగాదు. ఈలా గుర్తించింది మరియ. ఆమె క్రీస్తుకోసం వెదకుతూంది. తోటమాలి అనుకొని ఉత్తానక్రీస్తును గుర్తుపట్టలేకపోయింది. అప్పడు ప్రభువు "మరియా" అని పిలచాడు. వెంటనే ఆ స్వరాన్ని గుర్తుపట్టి, ప్రభూ అంటూ యేసు పాదాల మీద వ్రాలింది ఆ భక్తురాలు (యోహా, 20:16) ప్రభు వాక్కును విన్న ఆ భక్తురాలి అనుభూతి ఆలాంటిది. ఈలాగే ఎమ్మావు నుండి తిరిగివచ్చే శిష్యులుగూడ “అతడు లేఖనాలనుగూర్చి మనతో మాటలాడుతూవున్నపుడు మన హృదయం ప్రజ్వరిల్లలేదా " అని అనుకుంటారు (లూకా 24:32). దివ్యగ్రంథాన్ని భక్తితో చదువుతున్నావూ లేదా అని తెలిసికోవడానికి యీ యనుభూతిఒరపిడిరాయిలాంటిది.

11. ఆత్మ అనుగ్రహం :

పరిశుద్దాత్మ కొందరు భక్తులను ప్రేరేపించి దివ్యగ్రంథాలను వ్రాయించింది అన్నాం. తాను వ్రాయించిన దివ్యగ్రంథంలో ఈ యాత్మ వసిస్తూవుంటుంది. ఈ యాత్మ ప్రేరణం, సహకారం లేందే బైబులును అర్థం చేసికోలెు. బైబులు బోధించే క్రీస్తును ప్రేమించలేం. కనుక బైబులు చదవకముందు యీ యాత్మ అనుగ్రహం అడుక్కుంటూ వుండాలి. బైబులును ఆసక్తితో చదివి అర్థంజేసికోవాలని యీ యాత్మను వేడుకుంటూ వండాలి.