పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. పఠన ఫలితాలు

క్రైస్తవుడు బైబులు చదవకపోతే పెద్దనష్టానికి గురౌతాడు. అన్ని అనర్గాలకీ మూలం బైబులు జ్ఞానం లేకపోవడమేనన్నాడు క్రిసోస్తం భక్తుడు.

బైబులు పరనంవల్ల సిద్ధించే ఫలితాలు చాలా వున్నాయి. మొదటిది, దేవుడు మనతో సంభాషిస్తాడు. ప్రార్ధనం చేసికొనేపుడు మనం దేవునితో మాటలాడతాం. కాని బైబులు చదువుకొనేపుడు ఆ ప్రభువే మనతో సంభాషిస్తాడు. నరుడు దేవుని సందేశాన్ని ఆలించి ఊరట పొందడం గొప్ప భాగ్యం. క్యాంట్ అనే జర్మను తాత్వికుడు
"గాధాంధకారపులోయగుండా పయనిస్తున్నా
నేనే యపాయానికీ జంకను
నీవు నాకు తోడైయుంటావు
నీ చేతికోలా, నీ బడితా
నన్ను కాపాడుతూంటాయి"
అన్న 23వ కీర్తనలోని వాక్యం ప్రపంచంలోని పుస్తకాలన్నిటి కంటె గూడ తన కెక్కువ ఓదార్పుని చేకూర్చిపెట్టిందని చెప్పకొన్నాడు. గ్రంథపఠనం ద్వారా ప్రభువు మనతో మాటలాడినపుడు మనకూ ఈలాంటి ఓదార్చే కలుగుతుంది.

రెండవది, మన దుష్టబుద్ధి నశించి మంచిశీలం అలవడుతుంది. వినయమూ, ప్రేమా, న్యాయబుద్దీ, పాపాన్ని అసహ్యించుకోవడమూ మొదలైన సదుణాలు మన హృదయంలో చోటుచేసికొంటాయి. "రాత్రి గతించి పగలు సమీపిస్తుంది” అన్న రోమీయుల జాబులోని వాక్యం చదివి పాపజీవితం జీవిస్తున్న అగస్టీను పరివర్తనం చెందాడు - రోమా 13, 12–14. హృదయ పరివర్తనాన్ని గొప్ప వరప్రసాదంగా భావించాలి.

మూడవది, మనం క్రీస్తుని నేర్చుకొంటాం. క్రీస్తుని తెలుసుకొని, అతన్ని ప్రేమించి, అతని యడుగు జాడల్లో నడచేవాడు క్రైస్తవుడు. పౌలు ఈ క్రీస్తుని సంపాదిస్తే చాలు అనుకొన్నాడు. అతనితో పోలిస్తే ఈ లోకంలోని వస్తువులన్నీ చెత్తాచెదారంలాగ విలువ లేనివని భావించాడు– ఫిలి 3,8. ఇక, ఆ ప్రభువుని తెలిసికొనే ప్రధాన మార్గం బైబులే. కావుననే జెరోము భక్తుడు, బైబులు తెలియని వాళ్ళకు క్రీస్తంటే యేమిటో తెలియదు అని నుడివాడు.

4. పఠనపద్ధతి


బైబులును పఠించే పద్ధతులు చాలా వున్నాయి. వాటిల్లో ఒక ఉత్తమ పద్ధతి “లెక్సియొ దివీన.” భక్తిమంతమైన బైబులు పఠనమని ఈ ల్యాటిన్ పదాల భావం, దీనిలో