పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నన్నెందుకు చేయి విడిచావు?” అని సిల్వమీద క్రీస్తు పల్మిన వాక్యం (మత్త27,46) కీర్తన 22, 1 లోనిది. ఆవాక్యం క్రీస్తు నోటినుండి వెలువడినప్పడేగాని దాని పరిపూర్ణార్థం బయటపడలేదు. కాని అది క్రీస్తుకు వర్తిస్తుందని 22వ కీర్తన వ్రాసిన పూర్వవేద రచయితకు తెలియదు. అతడు తన్ను గూర్చే ఆ వాక్యాన్ని వ్రాసికొన్నాడు. నూత్న వేదంలొ నెరవేరిన పూర్వవేద ప్రవచనాలు చాలవరకు ఈ శాఖకు చెందుతాయి.

మూడవది, సాంకేతికార్థం. పూర్వవేదంలోని వ్యక్తులూ, స్థలాలూ, సంఘటనలూ నూత్న వేదంలోని వ్యక్తులనూ స్థలాలనూ సంఘటనలనూ సూచిస్తుంటాయి. ఉదాహరణకు మోషే క్రీస్తుని, యెరూషలేము శ్రీసభనీ, యూదులు రెల్లసముద్రాన్ని దాటడం జ్ఞానస్నానాన్నీ సూచిస్తాయి.

బైబులు వాక్యాలకు ఇంకా ఇతరార్థాలు కూడ వున్నాయి.

2. బైబులు పఠనం

1. హృదయభక్తి

బైబులు కేవలం పండితులకొరకే గాదు, సామాన్యప్రజల కొరకు గూడ వ్రాయబడింది. కనుక కొద్దిపాటి జ్ఞానంకలవాళు కూడ దాన్ని చదువుకోవచ్చు, చదువుకోవాలి. గ్రంథం చదువుకొని ప్రార్ధనం చేసికొని హృదయం మార్చుకోవడం ముఖ్యమైన విషయం. బైబులుని విజ్ఞానార్ధనం కొరకు గాక హృదయ పరివర్తనం కొరకు చదువుకోవాలి. సోదరప్రేమ, వినయం, విశ్వాసం, నిర్మలాంతరాత్మ ఉన్న నరునికి బైబులు పఠనం ఎక్కువ ఫలితమిస్తుందన్నాడు అగస్టీను భక్తుడు.

భగవంతుడు ఓ తండ్రిలాంటివాడు. ఆ ప్రభువు బైబులు గ్రంథంలోనుండి మనతో ఓ నాన్నలా సంభాషిస్తాడు. మన తరుపున మనం దివ్యగ్రంథంలోని వాక్యాలను సొంత తండ్రి పలుకులనులాగా స్వీకరించాలి. బైబులంటే పరలోకంలోని తండ్రి ఈ భూలోకంలో ప్రవాసంలో వున్న తన బిడ్డలకు అనురాగంతో వ్రాసిన లేఖ అన్నాడు క్రిసోస్తం భక్తుడు.

ఇంకా, బైబులు గ్రంథం ఓమనుష్యావతారం లాంటిది. మనం ఆ గ్రంథాన్ని పఠించినపుడల్లా క్రీస్తు మనమధ్యలోకీ మనహృదయంలోనికీ వేంచేస్తాడు. కనుకనే క్రీస్తుని గర్భాన ధరించిన మరియమాతలాగే ఆ ప్రభువు వాక్యాన్ని వినేవాళ్లు కూడ ధన్యులౌతారు — లూకా 11, 27-28.

పై పెచ్చు దివ్యగ్రంథ పారాయణం సంస్కారాలను స్వీకరించడంతో సమానమైంది. "మనం క్రీస్తు శరీరాన్ని భుజించి అతని రక్తాన్ని పానం చేసేది ఒక్క దివ్యసత్రసాదంలో