పుట:Bhoojaraajiiyamu.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కావ్యప్రస్తావన

17


బునఁ దలఁప మేలు సేకుఱుఁ,
జనదే హరినాశ్రయంప సత్పురుషులకున్.

75


వ.

అని పురాణవేదు లగు నాదిపురుషులు చెప్పునప్పుణ్యవచనంబులు మున్ను కని యునికింజేసి నిశ్చితుండనై .

76


సీ.

నూతనం బయ్యుఁ బురాతనకృతులట్ల
       సంతతశ్రవ్యమై జరుగు ననియు
నాదిరాజసమానుఁ డగుభోజభూపతి
       చరిత యీకవితాప్రసంగ మనియు
నిందుఁ జెప్పెడికథ లిన్నియు నోలిఁ బ్ర
       శస్తధర్మోపదేశంబు లనియు
నఖిలజగన్నాథుఁ డగునహోబలనాథుఁ
       డీపుణ్యకృతికి నధీశుఁ డనియుఁ


ఆ.

[1]బృథివి నెల్లజనులు ప్రియభక్తి యుక్తిఁ బా
టింతు రనియు నూఱడిల్లి యేను
బరమసౌఖ్యమైన భవదాభిముఖ్యంబు
నెమ్మిఁ బడసి యధికనిష్ఠతోడ.

77


సీ.

వర్ణిత ప్రహ్లాదవాక్యజయ స్తంభ
       మగుమహా స్తంభంబునందు వెడలి
సురసిద్ధఖేచరనరయోగిహృద్ధ్యేయ
       మగుమహోజ్జ్వలకాయ మమరఁ దాల్చి
భూరిదానవవంశపూర్ణతటాకంబు
       కట్ట నాఁ దగు దైత్యుపొట్ట వ్రచ్చి
శిష్టజనప్రజాభీష్టదాససమర్థ
       మగునహోబలతీర్థమందు నిలిచి


తే.

యవని నాబాలగోపాల మగుసమస్త
జీవులకు నందుబడి యైన దేవభూజ

  1. బృథివి నెల్లజనులు ప్రియభక్తి, బాటింతురనియు నూఱడిల్లి యేను