పుట:Bhoojaraajiiyamu.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కావ్యప్రస్తావన

13


క్షత్రకులము వోలెఁ గౌండిన్యగోత్రంబు
వెలసెఁ దిక్కమంత్రివిభునిచేత.

55


క.

ఏతద్వాంశపయోనిధి
శీతాంశుఁడ బుధచకోరచిత్తప్రియుఁడన్
వీతకళంకుండఁ గళో
పేతుఁడ నిర్ధూతదురితపృథుతిమిరుండన్.

56


క.

నరహరిచరణసరోజ
స్మరణామృతపానసతతసంతుష్టాంతః
కరణుఁడ సంతతవాణీ
వరప్రసాదానులబ్ధివాగ్విభవుండన్.

57


క.

శ్రీయువతీకారుణ్యర
సాయత్తకటాక్షవీక్షణాపాదితసు
శ్రేయస్కుఁడఁ గవినికరవి
ధేయుండ ననంతనామధేయుఁడ జగతిన్.

58

కావ్యప్రస్తావన

సీ.

సకలవిద్యలయందుఁ జర్చింపఁ గవిత యు
       త్కృష్ట మం డ్రది నిత్యకీర్తికొఱకు,
నర్థాప్తి[1]కొఱకును, వ్యవహారలక్షణం
       బెఱిఁగెడికొఱకు, ననేకవిధము
లగునమంగళముల హరియించుకొఱకు, ను
       చితనిత్యసౌఖ్యసంసిద్ధికొఱకు,
నొనరఁ గాంతాసమ్మితోపదేశంబునఁ
       ప్రీతిపై హిత మాచరించుకొఱకు,


ఆ.

నయ్యెఁ గానఁ బెద్ద [2]లాదరించెద రందు
నేర్పుకొలఁదిఁ గృతి యొనర్పఁ బూని
యస్మదీయకృతికి నధిసతిఁ గావింప
నర్హుఁ డెవ్వఁ డొక్కె యని తలంచి.

59
  1. కొఱకునా
  2. లాచరించెదరంచు