పుట:Bhoojaraajiiyamu.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

చేర్పవలెనని నిశ్చయింపనై నది. చౌకగా పాఠకులకు అందజేయవలెనను ఉద్దేశముతో యీ సంపుటాల వెల తక్కువగా నిర్ణయింపనైనది. ఇప్పటివరకు మొదటి తరగతిలో 29 పుస్తకాలను ప్రకటించి ముద్రించుట జరిగినది. ప్రస్తుతము రెండవ తరగతిలోని పుస్తకాల ప్రకటన ప్రారంభమైనది. మేము కోరినంతనే యీ సంపుటము సిద్ధముచేయు బాధ్యతను స్వీకరించి నిర్ణయించిన గడువులోపల వ్రాతప్రతిని అందజేసిన శ్రీ కొండూరు వీరరాఘవాచార్యులు గారికి అకాడమీ పక్షాన కృతజ్ఞతలు. ఈ తరగతిలోని మిగిలిన పుస్తకాలను యీ సంవత్సరాంతము వరకు ముద్రితము కాగలవని ఆశించుచున్నాను.

ఈ ప్రణాళికను అమలుచేసి వ్రాత ప్రతులను సిద్ధముగావించి ముద్రించుటకు కావలసిన డబ్బు మొత్తము అకాడమీకి యిచ్చుటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాగ్దానముగావించి యిప్పటివరకు కొంత డబ్బును గూడ విడుదల చేసినవి. ఇందులకు అకాడమీ పక్షాస కేంద్ర, రాష్ట్రప్రభుత్యాలకు ధన్యవాదాలు. నిర్ణయించిన గడువు లోపల యీ సంపుటాలనన్నిటిని ప్రకటించి ఆంధ్ర పాఠక లోకానికి అందజేయగలమని విశ్వసించుచున్నాను.

హైదరాబాదు

1 - 1 - 1969.

దేవులపల్లి రామానుజరావు.