పుట:Bhoojaraajiiyamu.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తొలిపలుకు

మూడు సంవత్సరాల క్రింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వములో సాంస్కృతిక వ్యవహారాల మంత్రిగా ఉండిన శ్రీ ఎం. ఆర్. అప్పారావుగారు చేసిన సూచనల ననుసరించి తెలుగు భాషలోని సాహిత్యము అందరికి అందుబాటులో నుండునట్లుగా ముద్రించి ప్రకటింప వలెనని అకాడమీ నిశ్చయించినది. తెలుగు భాషలోని పూర్వగ్రంథసముదాయము యీనాడు పాఠకునికి సక్రమముగా సరసమైన ధరకు లభ్యమగుట లేదు. ఈ లోటును తీర్చి ప్రాచీన గ్రంథ సంచయమును విడివిడిగా ప్రకటించుటకు సాహిత్య అకాడమీ, ఒక ప్రణాళికను సిద్ధము చేసినది. ఈ ప్రణాళిక ప్రకారము యీ కార్యక్రమము మూడు తరగతులుగా విభజింపనై నది. మొదటిది ప్రాచీన ప్రబంధాల ప్రకటన , రెండవది మహాభారతము, భాగవతము, హరివంశము, భాస్కరరామాయణము, బసవపురాణము, భోజరాజీయములను సంగ్రహించి ప్రకటించుట , మూడవది భారత భాగవతాల నుండియు నాచన సోమన, కంకటి పాపరాజు, కూచిమంచి తిమ్మకవి రచనల నుండియు భాగాలను యేర్చికూర్చి ప్రకటించుట. మొదటి తరగతిలో 29 ప్రబంధాలను 29 సంపుటాలుగా, రెండవ తరగతిలోని గ్రంథాలను 13 సంపుటాలుగా మూడవ తరగతిలోని గ్రంథాలను 8 సంపుటాలుగా, మొత్తము 50 సంపుటాలను ప్రకటించు కార్యక్రమము స్వీకరింపవలెనని అకాడమి తీర్మానించినది.

ఈ ప్రణాళిక ప్రకారము ప్రతి సంపుటము 1/8 డెమ్మీ సైజులో క్యాలికో బైండులో 200 పేజీల గ్రంథముగా నుండవలె నని నిర్ణయింపనై నది. ప్రతి గ్రంథములో గ్రంథకర్తను గూర్చి, గ్రంథప్రాశస్త్యమును గూర్చి వివరించు సుమారు 40 పేజీల పీఠికను