పుట:Bhoojaraajiiyamu.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రత్నమండనబ్రహ్మరాక్షసులు

147


చ.

'కలువలఁ దమ్ములన్ సమవికాసము నొందఁగఁ జేయుక్రాలుగ
న్నులు గలనీకుఁ బాన్పును మనోజ్ఞరథంబును [1]నాగ తద్విరో
ధులయిననీకు నారయఁ జతుర్భుజ! చేయఁగరాదె గోవునుం
బులియును శత్రుభావములఁ బోనిడి మైత్రి యొనర్చునట్లుగన్.

70


క.

దైవం బాదిగఁ దిర్య
గ్జీవులు తుదిగాఁగఁ గలయశేషము నీ యా
జ్ఞావిలసితవర్తనములు
గావే నీమహిమఁ దెలియఁ గలరే యితరుల్.'

71


వ.

అని కొనియాడుచుండి రంత నయ్యనంతుండుఁ దద్గోవ్యాఘ్రంబులఁ గారుణ్య
దృష్టి వీక్షించి 'మీ సచ్చరిత్రంబులకు మెచ్చితిం జెఱొక్క వరం బిచ్చెద
వేఁడుం ' డనిన నవి 'దేవా! భవద్దివ్యలోకంబు మాకుం బ్రసాదింప వలె'
నని ప్రార్ధించిన.

72


క.

ఇచ్చితి ననుచుం జనియె వి
యచ్చరతతి పొగడ విష్ణుఁ, డవియును జనియెన్
జెచ్చెరఁ దమ తమ నెలవుల
కచ్చుగఁ దుది నొదవెఁ గోర్కు లయ్యిరువురకున్.

73


వ.

ఈ గోవ్యాఘ్రసంవాదంబు విన్న నరులు మృగపన్నగాది బాధలం బొరయరు,
వెన్నుండు వారికిఁ బ్రసన్నుం డగు' నని చెప్పి మఱియును.

74


క.

పసరం బండ్రు, వివేకము
పస చాలనినీచు నట్టిపసరమ కాదే!
వసుధపయి సత్యవాక్యం
బసదృశముగ నిర్వహించె' నని కడుఁ బ్రీతిన్.

75


ఉ.

మానుగ రత్నమండనకుమారుఁడు పల్కుడు బ్రహ్మరాక్షసుం
డానరనాథపుత్రు వదనాబ్జము చూచి 'య దేనిఁ బొమ్ము, ము
న్నీనిజ మే నెఱుంగ, నిట నిక్కము రా నొకమాట పల్కు, మి
చ్చో నుదరాగ్ని నేను గడు శోషిలకుండఁగ రమ్ము క్రమ్మఱన్.'

76
  1. నాగ= శేషసర్పము. తద్విరోధి= దానికి విరోధియగు గరుడుఁడు.